CM KCR: విశాఖలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ..! ఎప్పుడంటే..!
బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. దేశ రాజకీయాల్లో దూసుకెళ్లాలని భావిస్తోంది. ఆ దిశగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భవంత్ మాన్, కేరళ సీఎం పినరయ్ విజయన్ పాల్గొననున్నారు. ఎస్పీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా హాజరుకానున్నారు. ఈ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు.
ఇది ఇలా ఉండగా.. త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ విశాఖలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించి తేదీలను కేసీఆర్ త్వరలో ఖరారు చేయనున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు నేతలో బీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఏపీలో కూడా బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications