దూసుకొస్తోన్న మచిలీపట్నం సూపర్ ఫాస్ట్

ఆగస్టు 15వ తేదీ గురువారం రావడంతోపాటు వరుసగా శుక్ర, శని, ఆదివారాలుండటంతో ప్రజలు స్వస్థలాలకు పయనమవుతున్నారు. దీంతో రైళ్లన్నీ తీవ్ర రద్దీతో ఉన్నాయి. ఆ నాలుగు రోజులకు టికెట్లు రెండు నెలల క్రితమే బుక్ అయ్యాయి. జనరల్ బోగీల్లో ఎక్కడం కష్టమవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కాచిగూడ నుంచి తిరుపతికి, హైదరాబాద్ నుంచి సంత్రాగచికి, నర్సాపూర్ నుంచి నాగర్ సోల్ వరకు, తిరుపతి నుంచి నాగర్ సోల్ వరకు, మచిలీపట్నం నుంచి వికారాబాద్ వరకు వీటిని నడుపుతున్నారు.

మచిలీపట్నం - వికారాబాద్
ఆగస్టు 13, 15 తేదీల్లో (07453) మచిలీపట్నం నుంచి రాత్రి 10.00 గంటలకు బయలుదేరి, తర్వాతరోజు ఉదయం 9.00 గంటలకు వికారాబాద్ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో 14, 16 తేదీల్లో (07454) వికారాబాద్ నుంచి రాత్రి 7.00 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 5.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటాయి. వీటికి గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లలో హాల్టింగ్ ఉంది.

south central railway announce special trains from machilipatnam to vikarabad

హైదరాబాద్ - సంత్రాగచి స్పెషల్ ట్రైన్స్
ఆగస్టు 14వ తేదీ ఉదయం 5.30 గంటలకు (07069) హైదరాబాద్ నుంచి బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు సంత్రాగచి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07070) 15వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు సంత్రగచిలో బయలుదేరి తర్వాత రోజు సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

మార్గమధ్యంలో ఈ రైళ్లు ఖరగ్‌పూర్, బాలాసోర్, భద్రక్, కియోంజర్ రోడ్, జాజ్ పూర్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బెర్హంపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, చీపురుపల్లి, విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట, జనగాం, సికింద్రాబాద్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం ఉంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు. రద్దీనిబట్టి అప్పటికప్పుడు రైళ్లను ఏర్పాటు చేసే నిర్ణయాన్ని కూడా తీసుకుంటామని, కాకపోతే అప్పటి పరిస్థితులపై అది ఆధారపడివుంటుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+