హైదరాబాద్, నరసాపురం, కాకినాడ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, నరసాపురం, కాకినాడ ప్రయాణికులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్దమైంది. వీటికి సంబంధించిన వివరాలు, ఏయే తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయన్న సమాచారాన్ని అధికారులు విడుదల చేశారు. వీటిని గమనించి ప్రయాణికులు తమ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవచ్చు.

ముందుగా చర్లపల్లి నుంచి కాకినాడ టౌన్ కు 07031 నంబర్ ప్రత్యేక రైలు సాయంత్రం 7.20కి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.30కు చేరుకుంటుంది. మే 2 నుంచి జూన్ 27 వరకూ ఈ ప్రత్యేక రైలు కొనసాగుతుంది. అలాగే కాకినాడ టౌన్ నుంచి చర్లపల్లికి 07032 నంబర్ ప్రత్యేకరైలు రాత్రి 6.55కు బయలుదేరి మరుసటి రోజు 6.50కి గమ్యానికి చేరుకుంటుంది. ఈ రైలు మే 4 నుంచి జూన్ 29వరకూ అందుబాటులో ఉంటుంది.

south central railway announced special trains for Hyderabad narasapuram and Kakinada passengers

అలాగే చర్లపల్లి నుంచి నరసాపురానికి 07233 నంబర్ ప్రత్యేక రైలు రాత్రి 7.15కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50కి చేరుకుంటుంది. ఈ రైలు మే 2 నుంచి జూన్ 27వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. అలాగే నరసాపురం నుంచి చర్లపల్లికి 07234 నంబర్ ప్రత్యేక రైలు రాత్రి 8 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు మే 4 నుంచి జూన్ 29 వరకూ అందుబాటులో ఉంటుంది.

చర్లపల్లి -కాకినాడ ప్రత్యేక రైళ్లకు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టాప్ లు ఉంటాయి. అలాగే ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్ లు ఉంటాయి. అలాగే చర్లపల్లి-నరసాపురం రైళ్లకు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్లలో స్టాప్ లు ఇచ్చారు. వీటికి కూడా సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్ లు అందుబాటులో ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+