తిరుపతికి వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం,ఇక..!!
తిరుపతికి వెళ్లే ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతికి వెళ్లే రైళ్లలో పెరుగు తున్న వెయిటింగ్ లిస్టు కారణంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. డిమాండ్ ఉన్న మార్గాల మీదుగా ఈ రైళ్లను కొనసాగించాలని డిసైడ్ అయింది. కాచిగూడ - తిరుపతి, హిస్సార్ - తిరుపతి మార్గం లో 48 ప్రత్యేక రైళ్లను కేటాయించారు. దాదాపు రెండున్నార నెలలు ఈ ప్రత్యేక రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు.
తిరుపతికి వెళ్లే ప్రయాణీకుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతితో పాటుగా పలు ముఖ్యమైన మార్గాల్లో మొత్తం 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడిం చింది. ముఖ్యంగా తిరుపతి, కాచిగూడ, నరసాపూర్, హిస్సార్, తిరువణ్ణామలై వంటి మార్గాల్లో అందుబాటులో ఉంటాయి. జులై 9 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. తిరుపతి-హిసార్ మధ్య 12 సర్వీసులను నడపనున్నారు. ఈ రైళ్లు ప్రతి బుధ, ఆదివారాల్లో అందుబాటులో ఉంటాయి. అదే విధంగా, కాచిగూడ-తిరుపతి మధ్య 8 రైళ్లు ప్రతి గురు, శుక్రవారాల్లో రాకపోకలు సాగిస్తాయి.

ఇక నరసాపూర్-తిరువణ్ణామలై మార్గంలో అత్యధికంగా 16 ప్రత్యేక రైళ్లను బుధ, గురువారాల్లో నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైళ్ల రాకపోకల సమయాలు, ఇతర పూర్తి వివరాల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. తిరుపతి - హిస్సార్ మధ్య: 12 స్పెషల్ ట్రైన్స్ (ప్రతి బుధ, ఆదివారాల్లో), ఇక. కాచిగూడ - తిరుపతి మధ్య: 8 స్పెషల్ రైళ్లు (ప్రతి గురు, శుక్రవారాల్లో), నరసాపూర్ - తిరువణ్ణామలై మార్గంలో: అత్యధికంగా 16 ప్రత్యేక రైళ్లు (బుధ, గురువారాల్లో) ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications