హైదరాబాద్-విశాఖ ప్రయాణికులకు హోలీ స్పెషల్ రైళ్లు..! స్టాప్ లు ఇవే..!

తెలుగు రాష్ట్రాల్లో రెండు కీలక నగరాలైన హైదరాబాద్, విశాఖ మధ్య హోలీ సందర్భంగా ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హోలీతో పాటు వారాంతపు సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లను నడుపుతోంది. వీటికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో ఏయే స్టేషన్లలో ఆగుతాయో కూడా వివరాలను అధికారులు ప్రకటించారు.

హోలీ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని చర్లపల్లి, విశాఖపట్నం స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ రెండు రైళ్లు ఈ నెల 16, 17 తేదీల్లో ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 16వ తేదీన విశాఖపట్నం నుంచి సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరే 08579 రైలు తిరిగి 17వ తేదీ ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకోనుంది. అలాగే చర్లపల్లిలో ఈనెల 17న ఉదయం 10 గంటలకు చేరుకునే 08580 నంబర్ రైలు అదే రోజు రాత్రి 10 గంటలకు విశాఖపట్నం చేరుకోనుంది.

south central railway announces two holi special trains between charlapalli and visakhapatnam

ఈ రెండు ప్రత్యేక రైళ్లకు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో హాల్ట్ ఇచ్చారు. అలాగే ఈ రెండు రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రయాణికులు వీటిని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ ప్రత్యేక రైళ్లకు ఎప్పటిలాగే ప్రత్యేక ఛార్జీలు వర్తిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+