ఏపీలో తొలిసారిగా ఆ చివర నుంచి ఈ చివరకు రైలు ఏర్పాటు

రానున్నది పండగల సీజన్ కావడంతో దక్షిణ మధ్య రైల్వే తిరుపతికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. విజయదశమి, దీపావళి, క్రిస్మస్ పర్వదినాలతోపాటు తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా ఉండటంతో వీటిని ఏర్పాటు చేశారు. అక్టోబరు ఆరో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. అప్పటికి ప్రయాణికుల నుంచి ఉండే డిమాండ్ ను బట్టి తర్వాత పొడిగించాలా? లేదా? అనే నిర్ణయాన్ని తీసుకుంటామని అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు 07440 నెంబరుతో ఈ బండి నడుస్తుంది.

అక్టోబరు ఆరోతేదీ నుంచి జవనరి ఒకటో తేదీ వరకు తిరుపతి-శ్రీకాకుళం రోడ్ రైలు ప్రతి ఆదివారం సాయంత్రం 5.10 గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 10.55 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. అలాగే అక్టోబరు ఏడోతేదీ నుంచి జనవరి రెండోతేదీ వరకు శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతికి బయలుదేరే రైలు 07441 ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలకు శ్రీకాకుళం రోడ్ లో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 8.00 గంటలకు తిరుపతికి చేరుకుంది.

south central railway arranged tirupati to srikakulam road special train

ఈ రైలుతోపాటుగా నాందేడ్ నుంచి బ్రహ్మపుర వరకు 07431, 07432 (బ్రహ్మపుర నుంచి నాందేడ్) పేరుతో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం మధ్యాహ్నం 3.25గంటలకు నాందేడ్‌లో బయలుదేరుతుంది. అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం 4.45గంటలకు నాందేడ్ వెళ్లే రైలు బ్రహ్మపురలో బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. భారీ వర్షాల వల్ల ఈరోజు విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (20833), సికింద్రాబాద్‌-విశాఖపట్నం (20834) గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌- విశాఖపట్నం (20708), విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (20708), నాందేడ్‌ - విశాఖ (20812), పుదుచ్చేరి-హౌరా (12868) రైళ్లను రద్దు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+