గుంటూరు ప్రజలకు ముఖ్య గమనిక

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. గుంటూరు మీదగా సికింద్రాబాద్, సంబల్ పూర్ కు ఇవి నడవనున్నాయి. జూన్ 3, 10 తేదీల్లో సోమవారం రాత్రి 9.00 గంటలకు సంబల్ పూర్ - సికింద్రాబాద్ (నెం. 08325) రైలు బయలుదేరుతుంది. గుంటూరుకు తర్వాతరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదగా సికింద్రాబాద్ కు రాత్రి 9.50 గంటలకు చేరుకుంటుంది.

అలాగే సికంద్రాబాద్-సంబల్ పూర్ ప్రత్యేక రైలు జూన్ 4, 11 తేదీల్లో మంగళవారం రాత్రి 11.35 గంటలకు బయలుదేరుతుంది. తర్వాతరోజు తెల్లవారుజామున గుంటూరుకు చేరుకొని రాత్రి 11.45 గంటలకు సంబల్ పూర్ చేరుకుంటుంది. సాంకేతిక పరమైన సమస్యలతో గుంటూరు - డోన్ ఎక్స్‌ప్రెస్ (17228)ని జూన్‌ 1 నుంచి 30వ తేదీ వరకు రద్దు చేశారు. డోన్‌ - గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17227) జూన్‌ 2 నుంచి జులై 1వ తేదీ వరకు రద్దయింది. ఈమేరకు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

south central railway runnig special train via guntur

రైల్వే గేటు దగ్గర ఉన్న సిగ్నలింగ్ లో సమస్యలు తలెత్తడంతో రేపల్లె నుంచి తెనాలి వెళ్లే ప్యాసింజర్ రైలును వేమూరు రైల్వేస్టేషన్ లో గంట సమయం నిలిపివేశారు.సాంకేతిక సమస్యలతో ఆ సిగ్నల్ పనిచేయలేదు. వడగాడ్పులు, తీవ్రమైన ఎండతోప్రయాణికులు బాగా ఇబ్బంది పడ్డారు. సాయంత్రం ఐదుగంటలకు ఈరైలు బయలుదేరి వెళ్లింది.

సిగ్నలింగ్ వ్యవస్థను భారతీయ రైల్వే ఆధునికీకరిస్తోంది. ఒడిసాలోని బాలసోర్ వద్ద గతేడాది జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రమాదంలో దాదాపు 300కు పైగా ప్రయాణికులు మరణించారు. రైల్వే ప్రమాదాల్లో అతి పెద్ద దుర్ఘటనగా అది నిలిచిపోయింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే డివిజన్ల పరిధిలోని సిగ్నలింగ్ వ్యవస్థలన్నింటినీ పూర్తిస్థాయిలో అప్ గ్రేడ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+