తిరుపతి, మచిలీపట్నం రైలు ప్రయాణికులకు బంపర్ న్యూస్..!
ఏపీలోని తిరుపతి, మచిలీపట్నం ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ డివిజన్ పరిధిలోకి వచ్చే ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ముఖ్యంగా వేసవి రద్దీని తట్టుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించబోతున్నాయి. ఈ రైళ్లు ఏయే రోజుల్లో రాకపోకలు సాగిస్తాయి, ఏయే స్టేషన్లలో హాల్ట్ ఇచ్చారనే వివరాలను అధికారులు వెల్లడించారు.
తిరుపతి నుంచి మచిలీపట్నానికి ఈ నెల 13 నుంచి మే 25వ తేదీ వరకూ అంటే 8 వారాల పాటు ప్రతీ ఆదివారం ప్రత్యేక రైలు నడుపుతున్నారు. అలాగే మచిలీపట్నం నుంచి తిరుపతికి ఈ నెల 14 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకూ ప్రతీ సోమవారం మరో ప్రత్యేక రైలు ప్రయాణించనుంది. ఇలా రెండు వైపులా కలిపి నెల రోజుల పాటు మొత్తం 16 రైళ్లు తిరుపతి-మచిలీపట్నం స్టేషన్ల మధ్య రాకపోకలు సాగిస్తాయి.

తిరుపతిలో బయలుదేరి ప్రత్యేక రైలు ఆదివారం రాత్రి 10.20కి బయలుదేరి సోమవారం ఉదయం 7.30కు మచిలీపట్నం చేరుకోనుంది. అలాగే మచిలీపట్నంలో సోమవారం సాయంత్రం 5.40కి బయలుదేరే ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారుజామున 3.20కి తిరుపతి చేరుకోనుంది. అలాగే ఈ రెండు రైళ్లకూ తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, పెడన, మచిలీపట్నంలో స్టాప్ లు ఇచ్చారు. అలాగే ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంచారు.












Click it and Unblock the Notifications