తిరుపతికి తియ్యటి వార్తను ప్రకటించిన నరేంద్రమోడీ
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టారు. 2014లో తొలిసారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రైల్వేలకు ఎనలేని ప్రాధాన్యాన్ని కల్పిస్తున్నారు. కాలక్రమంలో రైల్వేలోని సౌకర్యాలన్నీ మారుతూ వచ్చాయి. వస్తున్నాయి. ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలతో, భద్రతతో ప్రయాణాన్ని ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. అందుకనుగుణంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాగే రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవసరమైతే అప్పటికప్పుడే ప్రత్యేక రైళ్లను కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలు
ఈ క్రమంలోనే తిరుమలలో రేపు కైశిక ద్వాదశి ఉత్సవాలు జరుగుతుండటంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. రైళ్లల్లో రద్దీ నెలకొంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలును ప్రకటించారు. 13వ తేదీ రాత్రి 8.15 గంలకు తిరుపతి స్టేషన్ నుంచి బయలుదేరే ఈ రైలు తర్వాతరోజు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది. మార్గమధ్యంలో ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లె, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, రిజర్వేషన్ చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

అందుబాటులోకి వస్తున్న రైల్వే లైన్లు
ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే అధికారులు బెంగళూరు నుంచి బరౌనీ, దానాపూర్ కు నడిపిస్తున్న ప్రత్యేక రైళ్లను కూడా రాయలసీమ జిల్లాలమీదుగా నడిపిస్తున్నారు. గుంతకల్లు డివిజన్ లో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను అందుబాటులోకి తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యామ్నాయ రైలు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. గూడూరు, విజయవాడ రైల్వే లైనుపై ఒత్తిడి తగ్గుతుంది. దీన్ని తట్టుకోవడానికి ఇప్పటికే గూడూరు నుంచి విజయవాడ మధ్య మూడో రైల్వే లైను నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే విశాఖపట్నం-విజయవాడ మధ్య కూడా మూడో రైల్వే లైను పనులు పూర్తికావొచ్చాయి. దీనివల్ల కొన్ని రైళ్లకు క్రాసింగ్ ఇచ్చేందుకు ఏ రైలు ఇకనుంచి ఏ స్టేషన్ లో గంటల తరబడి ఆగే పరిస్థితి ఉండదు.












Click it and Unblock the Notifications