చల్లని కబురు, ఈసారి ముందుగానే రుతుపవనాలు- కేరళ తీరాన్ని తాకేది ఎప్పుడంటే..!!

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ భారీ ఉష్ణోగ్రతలు.. అదే సమయంలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సారి వర్షాకాలం ముందే రానున్నట్లు వెల్లడించింది. నైరుతీ రుతు ప‌వ‌నాలు కేర‌ళ‌ను తాకే తేదీల పైన స్పష్టత వచ్చింది. కాగా, ఒక వైపు ఎండలు మండుతున్న సమయంలో నే రెండు తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాలకు వర్షాల అలర్ట్స్ జారీ అయ్యాయి.

ఈ సారి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎండలు మండుతున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయి. మరో మూడు రోజుల్లో అండ మాన్ ను తాకనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మే 25న కేరళను తాకనున్నట్లు వెల్లడించారు. అంచ‌నా వేసిన‌ట్లు ముందుగానే రుతుప‌వ‌నాలు కేర‌ళ‌ను చేరితే, అప్పుడు 2009 త‌ర్వాత తొలిసారి వ‌ర్షాకాలం ముందుగా వ‌స్తున్న‌ట్లు ఐఎండీ వెల్ల‌డించింది. 2009 సంవ‌త్స‌ రంలో మే 23వ తేదీన నైరుతీ కేర‌ళ‌ను తాకిన‌ట్లు ఐఎండీ డేటా చబుతోంది. సాధార‌ణంగా జూన్ ఒక‌టో తేదీ వ‌ర‌కు కేర‌ళ‌లోకి నైరుతీ రుతుప‌వ‌నాలు ప్ర‌వేశిస్తాయి. ఈ రుతుప‌వ‌నాల రాకతో వ‌ర్షాకాలం ప్రారంభం అవుతుంది.

పది ఫలితాల విడుదల తేదీలు ఫిక్స్- ఏపీ, తెలంగాణలో ఇలా..!!
పది ఫలితాల విడుదల తేదీలు ఫిక్స్- ఏపీ, తెలంగాణలో ఇలా..!!
southwest-monsoon-could-make-an-early-start-bringing-much-needed-rain-to-southern-india-by-as-earl

మే చివరి వారంలోనే కేరళకు రుతుపవనాలు

యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్స్ అంచనాల ప్రకారం, ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే పలకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మే చివరి నాటికే దక్షిణ భారతదేశంలో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. మే 18 నుండి 25 మధ్య నైరుతి రుతుపవనాలు అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో సాధారణం కంటే 30 నుండి 60 మి.మీ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని అంచనాగా వెల్లడించారు. రుతుపవనాలు ముందే రావటం ద్వారా ఎండలతో అల్లాడుతున్న వేళ ఉపశమనం లభించనుంది. జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు ఈసారి నాలుగు నెలల్లో వ‌ర్షపాతం నార్మ‌ల్ స్థాయి క‌న్నా ఎక్కువే ఉంటుంద‌ని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+