స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎస్పీ బాలు: కేంద్రం లేఖ
హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అరుదైన గౌరవం దక్కనుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని ప్రతిపాదిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆయనకు లేఖ రాసింది.
ఎస్పీ బాలు ఇందుకు అంగీకరిస్తే... ఆయనకు స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ హోదా దక్కనుంది. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications