అమరావతిలో గత ప్రభుత్వ నిర్వాకం.. రూ.300కోట్ల అదనపు భారం
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాజధాని అమరావతిలో భవనాలు పూర్తి కాలేదని, అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ లను నిర్మించేందుకు ఖర్చు కూడా పెరిగిందని, ఈ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అదనంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 9 మాసాల్లో నిర్మాణాలను పూర్తి చేయాలని సిఆర్డిఏ అధికారులకు స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.
ఎంఎల్ఏ,ఎంఎల్సిల క్వార్టర్స్ పనులను పరిశీలించిన స్పీకర్
అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఎంఎల్ఏ,ఎంఎల్సిల నివాస సముదాయ భవనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సిఆర్డిఏ,అసెంబ్లీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎంఎల్ఏ,ఎంఎల్సి నివాస సముదాయంలో వివిధ గదులను శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు పరిశీలించారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన నిర్మాణ పనులు
అనంతరం ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర శాసన సభ,శాసన మండలి సభ్యులందరికీ కలిపి 288 నివాసాలు కల్పించేందుకు రాయపూడి వద్ద 12అంతస్తులతో కూడిన 12 టవర్ల నిర్మాణాన్ని గత టిడిపి ప్రభుత్వం హయాంలో చేపట్టిందని చెప్పారు. 2019 నాటికి 77 శాతం పనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అయితే గత ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిలిపి వేసి నిర్లక్ష్యం చేయడంతో నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయన్నారు.
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల పెరిగిన అంచనా వ్యయం
క్వార్టర్ లలో పిచ్చి మొక్కలు మొలిచాయని అన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల ఆయా పనులన్నిటినీ తిరిగి ప్రారంభించి పూర్తి చేసేందుకు అంచనా వ్యయం భారీగా పెరగడంతో పాటు గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గత ఐదేళ్ళుగా పనులు నిలిపి వేయడంతో చాలా వరకూ నిర్మాణ సామాగ్రి తుప్పు పట్టడం,కొంత మెటీరియల్ దొంగల పాలు కావటం వంటి సంఘటనలు జరిగాయన్నారు.
9 మాసాల్లోగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి
అమరావతి రాజధానిలో ఎంఎల్ఏ, ఎంఎల్సిలకు,ఇతర ఉన్నతాధికారులు,సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాలు హైదరాబాదులో కూడా లేవని ఆయన పేర్కొన్నారు. కావున ఈభవన సముదాయానికి సంబంధించిన ఫినిషింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి 9 మాసాల్లోగా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సిఆర్డిఏ అధికారులను కోరినట్టు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications