జగన్ మైక్ కట్ చేసిన స్పీకర్: సభలో దుమారం
హైదరాబాద్: బడ్జెట్‌పై ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మైకును స్పీకర్ కోడెల శివప్రసాద రావు మైక్ కట్ చేయడంతో గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. జగన్ మాట్లాడుతుండగా మీకు కావాల్సినంత సమయం ఇవ్వలేమని, సమయం అయిపోయిందంటూ స్పీకర్ మైక్‌ను కట్ చేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు.
వైసిపి సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. కాగితాలు చించి విసిరేశారు. ఈ స్థితిలో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీంతో స్పీరక్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్యనే మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వెళ్లారు. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ను కార్నర్ చేయడమే పనిగా పెట్టుకున్నారని మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు.

తమ నేత వైయస్ జగన్‌కు మరింత సమయం ఇవ్వాలని వైసిపి సభ్యులు స్పీకర్‌ను కోరారు. దానికి స్పీకర్ నిరాకరించారు. అచ్చెన్నాయుడు జగన్‌పై ఎదురుదాడికి దిగారు. ఆర్థిక విషయాలు తెలియనివారు కూడా సభలో మాట్లాడుతున్నారని జగన్ అన్నారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకోవాలని ఆయన అన్నారు. ఎదుటివారిపై రాళ్లు వేయడం సరి కాదని, కొంచెం బుర్ర కూడా ఉపయోగించాలని జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications