Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ కీలక నిర్ణయం..!!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం హోరా హోరీగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు వైసీపీ, టీడీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. రెండు పార్టీల నుంచి రెబల్ ఎమ్మెల్యేల పైన అనర్హత పిటీషన్ల విచారణ కొనసాగుతోంది. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు పంపారు.

స్పీకర్ నోటీసులు:వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేల పైన చర్చలు తీసుకోవాలని వైసీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అదే విధంగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నలుగురి పైనా చర్యలు కోరుతూ టీడీపీ ఫిర్యాదు ఇచ్చింది. దీంతో, ఈ ఎనిమిది మందికి ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేసారు. ఫిబ్రవరి 8న విచారణకు పిలవగా, వైసీపీ రెబెల్స్ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Speaker Tammineni issues notices for YSRCP Rebel MLAs to Attned before him on 12th

12న హాజరు కావాలంటూ:వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నోటీసులు పంపారు. ఈ నెల 8వ తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇచ్చారు. ఈ నెల 12వ తేదీన అనర్హత పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టనున్నారు. అనర్హత నోటీసుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాంను వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కలిసారు. స్పీకర్ తో పర్సనల్ హియరింగ్ కు హాజరుకావడం రెండోసారి అని కూడా ఆయన తెలిపారు. మొదటి సారి హాజరైనప్పుడు చాలా వివరాలు అడిగారనీ, అవన్నీ తాను చెప్పినట్లు ఆనం వివరించారు.

రాజ్యసభ ఎన్నికల వేళ:ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. వైసీపీ నుంచి ఇప్పటికే పోటీ చేసే తమ ముగ్గురు అభ్యర్దులను ప్రకటించారు. టీడీపీ నుంచి తమ అభ్యర్దిని పోటీకి దించాలని తొలుత భావించినా, ఇప్పుడు పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. దీని ద్వారా రాజ్యసభలో టీడీపీ తొలి సారి ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఈ సమయంలో టీడీపీ పోటీ చేయించే అంశం పై తర్జన భర్జన పడుతోంది. ఈ సమయంలో నెంబర్ గేమ్ ప్రారంభం కానుంది. దీంతో..పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యల దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నెల 12న ఎమ్మెల్యే విచారణ తరువాత స్పీకర్ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+