Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తీవ్ర మనస్తాపానికి గురవుతున్నా .. సారీ సభ నడపలేను : స్పీకర్ తమ్మినేని వాకౌట్

Recommended Video

    AP Assembly Speaker Tammineni Sitaram Walkout ! | Oneindia Telugu

    ఏపీ అసెంబ్లీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది .స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు . టీడీపీ సభ్యుల తీరుకు నిరసనగా సభ నుంచి వెళ్లిపోతున్నా అంటూ హెడ్ ఫోన్స్ టేబుల్‌పై పడేసి వెళ్లిపోయారు. టీడీపీ సభ్యుల తీరుతో మనస్తాపానికి గురవుతున్నానంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన ఆయన సడన్ గా వాకౌట్ చెయ్యటం చర్చనీయంశంగా మారింది.

    ఎస్సీ కమిషన్ బిల్లుపై సభలో చర్చలో సడన్ గా స్పీకర్ వాకౌట్

    ఎస్సీ కమిషన్ బిల్లుపై సభలో చర్చలో సడన్ గా స్పీకర్ వాకౌట్

    సభ ప్రారంభం నుంచే టీడీపీ సభ్యులు అమరావతిపై చర్చ జరపాలని స్పీకర్ ను పట్టుబట్టారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చకు స్పీకర్ అనుమతించగా అది కాదని అమరావతిపై చర్చ జరపాలని జై అమరావతి అంటూ నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు . అమరావతి నినాదాలతో సభలో ఎంతసేపటికి సభ్యులు శాంతించకపోవడంతో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సభ నుంచి వెళ్లిపోయారు. మనస్తాపానికి గురయ్యాను.. ఐయామ్ సారీ.. నేను వెళ్లిపోతున్నా అంటూ బయటకు వెళ్లిపోయారు.

    టీడీపీ సభ్యులు అమరావతిపై చర్చకు పట్టు

    టీడీపీ సభ్యులు అమరావతిపై చర్చకు పట్టు

    అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం సైతం ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్‌ ఎస్సీ కమిషన్‌ ఏర్పాటు బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు.కానీ టీడీపీ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. అమరావతిపై చర్చ జరగాలని కోరారు.

     టీడీపీ సభ్యుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నా అంటూ వెళ్ళిపోయిన స్పీకర్

    టీడీపీ సభ్యుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నా అంటూ వెళ్ళిపోయిన స్పీకర్

    అయినప్పటికీ ఎస్సీ కమిషన్‌ ఏర్పాటు బిల్లు ప్రవేశపెట్టి అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు . ఈ క్రమంలో టీడీపీ సభ్యుల తీరుతో తమ్మినేని సీతారాం.. ప్లీజ్‌...ఐ యామ్‌ సారీ.... ఐ యామ్‌ ప్రొటెస్టింగ్‌ ది ఆటిట్యూట్‌ ఆఫ్‌ టీడీపీ ఎమ్మెల్యేస్‌, నిజంగా మనస్తాపానికి గురవుతున్నా అంటూ సభ నుంచి వెళ్లిపోయారు. రాజధాని విషయంలో ఇంత ఆందోళలను జరుగుతున్న సమయంలో అత్యంత ముఖ్యమైన రాజధాని అమరావతి అంశాన్ని పక్కన పెట్టి ఎస్సీ కమీషన్ ఏర్పాటు బిల్లుపై చర్చ జరపటం కరెక్ట్ కాదని టీడీపీ సభ్యులు సైతం అసహనంతో ఉన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+