వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోదా ఇవ్వాల్సిందే, ఏం సాయం చేశారు, గట్టిగా అడుగుతున్నా: మోడీపై బాబు ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని, విభజన హామీలు అమలు చేయాలని కోరానని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తున్నప్పడు ఏపీకి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ మరో జేఎఫ్‌సీ వేయాలి, పిచ్చికుక్కల..: బాబుపై పార్థసారథి సంచలనంపవన్ కళ్యాణ్ మరో జేఎఫ్‌సీ వేయాలి, పిచ్చికుక్కల..: బాబుపై పార్థసారథి సంచలనం

రాజ్యసభలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం అరకొర సాయం మాత్రమే చేసిందని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ఇప్పటికే ఏపీ అభివృద్ధి చెంది ఉండేదని చెప్పారు. ఏహీకి హామీల విషయంలో కేంద్రాన్ని తాను గట్టిగా డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. మనం మనోధైర్యంతో ముందుకెళ్తున్నామన్నారు.

తెలుగువారి ఆత్మగౌరవం కించపరచొద్దు

తెలుగువారి ఆత్మగౌరవం కించపరచొద్దు

రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడే ఏ పార్టీని అయినా తాను అభినందిస్తానని, ఆహ్వానిస్తానని చంద్రబాబు చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరచవద్దన్నారు. కొన్ని పార్టీలు కేంద్రాన్ని కాకుండా తనను టార్గెట్ చేస్తున్నాయని వైసీపీని ఉద్దేశించి అన్నారు.

 వారితో కలిసేందుకు సిద్ధమవుతున్నారా?

వారితో కలిసేందుకు సిద్ధమవుతున్నారా?

రాష్ట్రాభివృద్ధి కోసం పని చేసే ఏ పార్టీని అయినా అభినందిస్తానని చంద్రబాబు చెప్పడం ద్వారా పరోక్షంగా జనసేనను ఉద్దేశించి అని ఉంటారని అంటున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న లెఫ్ట్ పార్టీలతో వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

 కేంద్రం నిధులు ఇవ్వలేదని పథకాలు ఆపం

కేంద్రం నిధులు ఇవ్వలేదని పథకాలు ఆపం

అంతకుముందు, ఏపీకి హోదా ఇస్తామని చెప్పి కేంద్రం మోసం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామని చెప్పి దానిని నెరవేర్చలేదన్నారు. కేంద్రం నిధులు ఇవ్వలేదని చెప్పి తాము సంక్షేమ పథకాలు ఆపేది లేదన్నారు. హోదా నుంచి ప్యాకేజీ, విభజన హామీల వరకు మోసం చేశారన్నారు.

హోదా

హోదా

ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇచ్చినప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలు దానిని ప్రశంసించారు. హోదా కంటే ప్యాకేజీ బెట్టర్ అన్నారు. హోదా వల్ల లాభం లేదని టీడీపీ నేతలు పదేపదే చెప్పారు. కానీ ఇప్పుడు విభజన హామీలు నెరవేర్చలేదని చెబుతూ తిరిగి హోదా డిమాండును ఎత్తుకున్నారు. హోదా, ప్యాకేజీలపై ఇలా మాట్లాడుతున్న చంద్రబాబు, టీడీపీలను ప్రజలు ఎలా నమ్ముతారని వైసీపీ ప్రశ్నిస్తోంది.

English summary
Reiterating that bifurcation was not done properly, Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu said the promises made to the State had not yet been fulfilled; the Special Category Status (SCS) was its right and it should be given.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X