TTD: తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు, ఆ రోజు వరకు సామాన్య భక్తులు
తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు టీటీడీ రద్దు చేసింది.శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణంగా కంటే అధిక సంఖ్యో లో తిరుమలకు విచ్చేస్తారు.
కావున శ్రీవారి వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.ఇందులో భాగంగా అక్టోబరు 3వ తేదీ (అంకురార్పణం) నుండి 12వ తేదీ (చక్రస్నానం) వరకు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, సంవత్సరంలోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు టీటీడీ కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. విఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ మనవి చేసింది.

తిరుమలకు శ్రీవారి భక్తుల అదిక సంఖ్యలో తరలి వస్తున్నారు. తిరుమలలో రద్దీ సాధారణంగా కంటే ఎక్కువగానే రద్దీ ఉంది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. ముందుగానే రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న శ్రీవారి భక్తులు కొన్ని గంటల ముందు తిరుమల చేరుకుంటున్నారు. సర్వదర్శనం చేసుకునే భక్తులు, టోకన్లు లేకుండా తిరుమల చేరుకుంటున్న భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉన్నారు.
శ్రీవారిని దర్శించుకోవడానికి కొన్ని గంటలపాటు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ ల్లో భక్తులు వేసి ఉన్నారు. బుధవారం తిరుమలలో 74,957 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం 33, 066 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ 4. కోట్ల వచ్చింది. తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ల్లో వేచి ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. తిరుమల వైకుంఠం లో వేచి ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ అందించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications