లిక్కర్ స్కాం విచారణలో కానిస్టేబుల్ పై దాడి ఫేక్ ? కుట్ర కోణం ఉందన్న సిట్..!

ఏపీ మద్యం స్కాం విచారణలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు గతంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గన్ మెన్ గా వ్యవహరించిన మదన్ రెడ్డి అనే కానిస్టేబుల్ ను విచారణకు పిలిపి ఆయన పేరు చెప్పాలంటూ కోరారని, నిరాకరించిన తనపై దాడి చేశారని, దీంతో ఆరు రోజుల పాటు ఆస్పత్రి పాలైనట్లు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో సిట్ దీనిపై స్పందించి క్లారిటీ ఇచ్చింది.

మద్యం కుంభకోణంపై సిట్ విచారణ లో బాగంగా పదేళ్లపాటు చెవిరెడ్డి దగ్గర గన్‍మెన్‍(PSO)గా చేసిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లిక్కర్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేశారని, చెవిరెడ్డికి కేసుతో సంబంధం ఉందని చెప్పమన్నారని. తప్పుడు స్టేట్‍మెంట్ ఇవ్వనని చెప్పినందుకు, అతనిని సిట్ అధికారులు బెదిరించి కొట్టారు అని మీడియా ద్వారా చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని వారు తెలిపారు.

special investigation team refute constable s attack allegation in custody in ap liquor scam case

గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం పై మంగళగిరి సి.ఐ.డి. పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులో దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసారని, అప్పటి నుండి ఈ కేసులో పలువురు సాక్షులను, అనుమానితులను విచారించామని తెలిపింది. అదే విధంగా ప్రధాన ముద్దాయి అయిన కెస్సిరెడ్డి రాజ శేఖర రెడ్డి సహా పలువురు నిందితుల్ని విచారించినట్లు వెల్లడించింది. ఇందులో వెలుగు చూసిన నిజాల ఆధారంగా మద్యం కుంభకోణం ముడుపులు ముద్దాయి అయిన కెస్సిరెడ్డి రాజ శేఖర రెడ్డి నుండి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డికి భారీ మొత్తంలో అందాయాని, వీటినే ఎన్నికల సమయంలో ప్రజలకు పంచినట్లు తెలిపింది.

ఈ నేపధ్యంలో పదేళ్లుగా చెవిరెడ్డి భాస్కర రెడ్డికి పర్సనల్ గన్ మెన్ గా పని చేసిన తిరుపతి జిల్లా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని విచారణ కోసం సిట్ కార్యాలయానికి పిలిపించామని, విచారణ సమయంలో ఆయన అధికారులకు సహకరించకుండా, మీ పేర్లు రాసి చనిపోతానని బెదిరించాడన్నారు. కానీ సిట్ మాత్రం నిష్పాక్షికంగా, నిబద్ధతతో ఈ కేసును విచారిస్తున్నట్లు తెలిపారు. కస్టడీలో అతనిపై ఎలాంటి దాడీ జరగలేదని అధికారులు తెలిపారు.

special investigation team refute constable s attack allegation in custody in ap liquor scam case

ఈ ఆరోపణల వెనుక కుట్ర కోణం ఉందని తాము అనుమానిస్తున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. అందుకే తప్పుడు ఆరోపణలతో డీజీపీకి ఫిర్యాదు చేయడం, హైకోర్టులో పిటిషన్ వేయడం చేశారన్నారు. ఈ మధ్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డితో సంబందం ఉన్న బాలాజీ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని సిట్ అక్రమ నిర్భంధం చేసిందని హై కోర్ట్ లో హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారని, ఇది కూడా పచ్చి అబద్దమని తెలిపారు. ఈ రెండు ఘటనలు చూస్తూ ఉంటే సిట్ దర్యాప్తు అడ్డుకునేందుకు, అదికారులపై ఒత్తిడి చేసి తద్వారా ఈ కేసు దర్యాప్తు బలహీన పరచాలనే ఉద్దేశంతో కొన్ని అదృశ్య శక్తులు కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తుందని వెల్లడించారు. ఈ కుట్ర బయటపెట్టి కోర్టు ముందు ఉంచుతామన్నారు. అలాగే కానిస్టేబుల్ ఆరోపణలపై సీనియర్ అధికారితో దర్యాప్తు చేయించాలని డీజీపీని కూడా కోరినట్లు తెలిపారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+