వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది మా హక్కు: సుజనా చౌదరి, జీతం ఇవ్వడం లేదని ఆందోళన

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కు అని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి గురువారం అన్నారు. కేంద్రం ఒక్కో హామీని నెరవేరుస్తోందని చెప్పారు. ఒక్కొక్కటి అమలు అవుతాయని అన్నారు.

ప్రత్యేక హోదాను సాధించేందుకు కేంద్రంతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. కేంద్రం కూడా ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం తమకు ఉందని తెలిపారు.

పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానాన్నికి శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుందన్నారు.

Special Status is our right: Sujana

ఆసుపత్రిని పరిశీలించిన శిద్దా

ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో మంత్రి శిద్ధా రాఘవ రావు ఆసుపత్రిని పరిశీలించారు. ఎక్స్ రే ల్యాబ్, వార్డుల్లో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు.

జీతాలు ఇవ్వడం లేదని ఉద్యోగుల ఆందోళన

జీతాలు ఇవ్వడం లేదని హైదరాబాదులోని వెటర్నరీ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 3 నెలల క్రితం ముప్పై మందిని తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. అయితే తొలగించిన ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం చేర్చుకోలేదు. ఇరు ప్రభుత్వాల నడుమ చిక్కుకున్న ఉద్యోగులు ఇబ్బందులపాలు అవుతున్నారు.

English summary
Union Minister Sujana Choudhary on Thursday said that special Status is our right.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X