చంద్రబాబు జగన్ ట్రాప్‌లో పడ్డారా: ప్రత్యేక హోదాపై వెంకయ్యXజైట్లీ!
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విపక్ష వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల ట్రాప్‌లో పడ్డారా? అందుకే ఆయన బీజేపీకి అల్టిమేటం జారీ చేస్తున్నారా? అంటే బీజేపీ కీలక నేతలు అవుననే వ్యాఖ్యానిస్తున్నారని తెలుస్తోంది.
ప్రత్యేక హోదా పైన గత శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో టిడిపి నేతలు... చివరకు చంద్రబాబు కూడా బీజేపీపై మండిపడ్డారు. ఆయన ఏకంగా ప్రధాని మోడీని నిలదీశారు. అన్ని వైపుల నుంచి బీజేపీ టార్గెట్ అయింది.
వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలను అంతగా పట్టించుకోని బీజేపీ ముఖ్య నేతలు.. టిడిపి నేతల వ్యాఖ్యలు, మరీ ముఖ్యంగా చంద్రబాబు విమర్శలపై ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. విపక్షాల ట్రాప్‌లో పడ్డ చంద్రబాబు విమర్శలు తమను బాధించాయని చెబుతున్నారని తెలుస్తోంది.
Also Read: ఇవి ఇచ్చాం: బాబుకు కేంద్రమంత్రి లెక్క, 'పవన్ కళ్యాణ్ మోడీని ప్రశ్నించరేం'

ఇప్పటికే జాతీయస్థాయిలో శివసేన వంటి పార్టీలతో మిత్రబేధం వచ్చింది. ఈ నేపథ్యంలో టిడిపితో దోస్తీని చెడగొట్టుకోవద్దని బీజేపీ భావిస్తోంది. చంద్రబాబు అంత తీవ్ర వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని బీజేపీ ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్, వైసిపిల బంద్ పిలుపు, వారి ఉద్యమం నేపథ్యంలోనే తమ పార్టీ ఇరుకున పడకుండా బీజేపీని చంద్రబాబు టార్గెట్ చేశారనే వాదనలు కూడా ఉన్నాయి. మొత్తానికి ప్రతిపక్షాల వల్లే చంద్రబాబు స్పందించారని అంటున్నారు.
Also Read: జగన్కు కాంగ్రెస్ జత, బాబు వ్యూహం: ఆత్మరక్షణలో బీజేపీ, మోడీకి భయమా?
జైట్లీ వర్సెస్ వెంకయ్య
ఏపీకి ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ విషయంలో సోమవారం నాడు కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడుల మధ్య ఒకింత వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇచ్చిన హామీ మేరకు హోదా ఇవ్వాలని వెంకయ్య కోరగా, 14వ ఆర్థిక సంఘం విషయం జైట్లీ చెప్పారని తెలుస్తోంది.
హోదా ఇవ్వడానికి ఆర్థిక సంఘానికి సంబంధం లేదని వెంకయ్య చెప్పగా, ఆర్థిక సంఘం నుంచి ఏమేం కావాలో ఏపీ ప్రతిపాదనలతో లేఖ పంపిందని, దాని ప్రకారమే లెక్కలు వేసి లోటు ఎలా భర్తీ చేయాలో కమిషన్ సిఫార్సు చేసిందని జైట్లీ చెప్పారని తెలుస్తోంది.