స్పీకర్‌పై దౌర్జన్యం, కాగితాలు విసిరి, మైక్ లాగేసిన వైసీపీ! తీవ్ర గందరగోళం

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ రెండో రోజు (శుక్రవారం) ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైంది. ప్రత్యేక హోదా పైన చర్చకు వైసిపి పట్టుపడుతోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేస్తారని అధికార తెలుగుదేశం పార్టీ చెప్పింది.

మైక్ లాగేసిన సభ్యులు

అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం తిరిగి పదకొండు గంటలకు ప్రారంభమైంది. వాయిదా పడినప్పటికీ సభలో గందరగోళం ఆగలేదు. వైసిపి సభ్యులు స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టారు. స్పీకర్ వద్ద ఉన్న మైక్‌ను లాగి పడేశారు. స్పీకర్‌కు మార్షల్స్ రక్షణగా నిలిచారు.

స్పీకర్ పైకి కాగితాలు విసిరేశారు. శ్రీనివాసులు, రామకృష్ణా రెడ్డిలు కుర్చి పైకి ఎక్కి నినాదాలు చేశారు. స్పీకర్‌కు రక్షణగా నిలిచిన మార్షల్స్‌ను లాగి పడేశారు. మార్షల్స్, వైసిపి సభ్యుల మధ్య తోపులాట జరిగింది. సభలో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో మరోసారి పదిహేను నిమిషాలు వాయిదా పడింది. కాగా, సంతాప తీర్మానం సమయంలో ఇది జరిగింది.

- తిరిగి ప్రారంభమైన సభ

- మా గౌరవం కాపాడండి

ప్రతిపక్ష సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చొని వారి గౌరవం కాపాడుకోవాలని, అలాగే మా గౌరవం (స్పీకర్) కాపాడాలన్నారు. విపక్షం చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తోందన్నారు. సభ్యుల తీరు సరికాదన్నారు. స్పీకర్ స్థానాన్ని గౌరవించాలని, దౌర్జన్యం సరికాదన్నారు. పొరపాటు చేస్తున్నారన్నారు. సభలో గందరగోళం నెలకొనడంతో సభను స్పీకర్ పదినిమిషాలు వాయిదా వేశారు.

Special status issue rocks AP

- పోడియం వద్ద వైసిపి సభ్యులను అడ్డుకున్న మార్షల్స్
వైసిపి సభ్యులు పోడియంను చుట్టుముట్టడమే కాకుండా, స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టారు. వైసిపి సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. మార్షల్స్‌కు, వైసిపి సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది.

- దీనిపై ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ... వైసిపికి చిత్తశుద్ధి లేదన్నారు. రూల్స్ తెలియకుండా మాట్లాడవద్దన్నారు.
- ప్రత్యేక హోదా పైన చర్చకు పట్టుబడుతూ వైసిపి సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లారు.
- దీనిపై యనమల మాట్లాడుతూ.. అసెంబ్లీ రూల్స్ తెలియవని, ప్రకటన తర్వాతే చర్చ ఉంటుందన్నారు. ఇవి మీ లోటస్ పాండు రూల్స్ కావని విమర్శించారు. లోటస్ పాండ్ రూల్స్ అసెంబ్లీలో వర్తించవని ఎద్దేవా చేశారు.
- ప్రత్యేక హోదా పైన చర్చ జరగాలని వైసిపి పట్టుబడింది. దీనిపై యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. సీఎం ప్రకటన చేస్తారన్నారు. తమకు చర్చ కావాలని వైసిపి డిమాండ్ చేసింది.
- ప్రత్యేక హోదా కావాలని, ప్యాకేజీ పైన నిరసన తెలుపుతూ వైసిపి సభ్యులు నల్లటి దుస్తులతో అసెంబ్లీకి వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+