Pick Talk: మీకో దండం- ఇక ఆ విషయం మరిచిపోతాంలెండి
Chandrababu Naidu: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇవి. ఇదివరకు సార్వత్రిక ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్‌ను సభ ముందు ఉంచారు. ఇప్పుడు ఇది పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలు.
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తంగా ఆమెకు ఇది ఏడవది. ఇప్పటి వరకు ఆరుసార్లు బడ్జెట్‌ను సభకు సమర్పించారు.

ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం.. భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడి మనుగడ సాగిస్తోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 272 కాగా.. 292 మంది సభ్యుల బొటాబొటి మెజారిటీ ఉంది ఎన్డీఏకు. ఇందులో కూడా రెండు పార్టీలే కీలకంగా వ్యవహరిస్తోన్నాయి.
ఆ రెండూ తెలుగుదేశం, జనతాదళ్ (యునైటెడ్). ఈ రెండింటికీ కలిపి 28 మంది సభ్యుల బలం ఉంది. ఈ నేపథ్యంలో- టీడీపీ, జేడీయూ అధికారంలో ఉన్న ఏపీ, బిహార్ రాష్ట్రాలకు ఈ వార్షిక బడ్జెట్‌లో భారీగా వరాలను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్‌ను సంతృప్తి పరిచేలా ఆర్థిక చేయూతలను ప్రకటించింది.
ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి పర్చడానికి 15,000 కోట్ల రూపాయలను ఇస్తామని ప్రకటించారు నిర్మల సీతారామన్. ఏపీలో వెనుకబడిన మూడు జిల్లాల అభిృద్ధికి ప్రత్యేకంగా గ్రాంట్‌ను మంజూరు చేస్తామనీ అన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తామని అన్నారు.
ఈ తరహా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం.. ప్రత్యేక హోదాను హామీని దాటవేసినట్టే కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఏపీని పక్కనపెడితే బిహార్- ప్రత్యేక హోదా కోసం తీర్మానం సైతం చేసిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర డిమాండ్‌ను కూడా కేంద్రం అటకెక్కించినట్టయిందనే వాదనలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications