విజయమ్మ 'పాదనమస్కారం'పై లోకేష్, టీడీపీకి యడ్యూరప్ప-జవదేకర్ దిమ్మతిరిగే షాక్
Recommended Video

అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. టీడీపీ మరో అడుగు ముందుకు వేసి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెబుతోంది.
చదవండి: మోడీ చెప్పారు! త్వరలో శుభవార్త: హోదా కోసం శ్రీవారికి రాఘవేంద్ర రావు గడ్డం
కర్నాటక తెలుగువారికి టీడీపీ పిలుపు ఓ విధంగా కాంగ్రెస్‌కు అనుకూలం అని భావిస్తున్నారు. బీజేపీకి ఓటు వేయవద్దని చెప్పడం ద్వారా టీడీపీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పిలుపునిచ్చినట్లుగా పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంది. ఇక, టీడీపీ-వైసీపీలు విమర్శలు గుప్పించుకుంటున్నారు.
చదవండి: ఒక్క దెబ్బకు 3 పిట్టలు!: కార్నర్ చేసేందుకు చంద్రబాబు 'వీడియో' ప్లాన్

విజయమ్మ వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
సోమవారం ఢిల్లీలో వైసీపీ ఎంపీల దీక్షా ప్రాంగణంలో వైయస్ విజయమ్మ వ్యాఖ్యలకు టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము నిలదీస్తామని, కానీ కాళ్లు మొక్కమని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి పోరాడుతామన్నారు. మోడీ ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాసం పెడితే, మద్దతివ్వాలని కోరితే విపక్షాలన్నీ అండగా నిలబడ్డాయన్నారు. ఏపీకి ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయన్నారు.

విజయమ్మ వ్యాఖ్యలు
మీ పాదాలకు నమస్కరించి అడుగుతున్నానని, ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చెప్పండని, ఏపీ ప్రజలు దేనికీ నోచుకోలేదని వైయస్ విజయమ్మ అన్నారు. ఆమె మీ పాదాలకు నమస్కరించి కోరుతున్నానని మోడీని అనడంపై లోకేష్ పైవిధంగా స్పందించారు. ముగ్గురు ఎంపీలు ఆసుపత్రిలో చేరితే మూడు వికెట్లు పడ్డాయని, ఇంకో రెండు వికెట్లు పడితే వెళ్లి బీజేపీతో రాజీ పడతారని టీడీపీ ఎంపీలు అనడం సరికాదని విజయమమ్మ చెప్పారు. భేషజాలకు పోకుండా 25 మంది ఎంపీలు రాజీనామా చేసి హోదా సాధించుకుందామన్నారు.

ఆయన ఇష్టమని జవదేకర్, ఆయనెవరని యడ్యూరప్ప
కర్నాటకలోని తెలుగు ఓటర్లు బీజేపీని ఓడించాలని కేఈ కృష్ణమూర్తి పిలుపునివ్వడంపై బీజేపీ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, ఎన్నికల సమయంలో తమకు ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసుకునే స్వేచ్ఛ కేఈకి ఉందని జవదేకర్ అన్నారు. కర్నాటక బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప మాత్రం గట్టి కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకలోని తెలుగువారంతా బీజేపీకి ఓటు వేయవద్దని పిలుపునిచ్చేందుకు ఆయనెవరని, ఆయన మాటలను ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్యానించారు.

మోడీని ఎదిరించిన ఏకైక పార్టీ టీడీపీ
టీడీపీ ఎంపీలు కేశినేని నాని, జేసీ దివాకర్ రెడ్డి వంటి వారు అయితే ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మోడీ ప్రధానిగా ఉన్నంత కాలం హోదా రాదని జేసీ అన్నారు. మోడీకి మాటలు ఎక్కువ పని తక్కువ అని కేశినేని నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి హోదా కోసం ఎంతకైనా పోరాడతామన్నారు. ఈ నాలుగేళ్లలో మోడీని ఎదిరించిన ఏకైక పార్టీ టీడీపీనే అన్నారు. వైసీపీ రాజీనామా పెద్ద డ్రామా అని, రాజీనామాలు చేస్తే పార్లమెంటులో ఎవరు పోరాడతారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధించేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు.

అందరి మధ్య మాటల యుద్ధం
నిత్యం తమను టార్గెట్ చేసుకుంటుండంతో బీజేపీ కూడా టీడీపీపై మండిపడుతోంది. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని ఏపీ బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు పాలనలో ఎంతో అవినీతి జరుగుతోందని, అలాంటి చంద్రబాబే తిరిగి తనపై కేసులు పెడతారని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు, హోదాపై చంద్రబాబు హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నారని విమర్శిస్తున్నారు. ఇక, అప్పుడప్పుడు జనసేన - వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications