ఒక్క దెబ్బకు 3 పిట్టలు!: కార్నర్ చేసేందుకు చంద్రబాబు 'వీడియో' ప్లాన్
Recommended Video

అమరావతి: ప్రత్యేక హోదా ఉద్యమం సీన్ ఢిల్లీ నుంచి కొంత ఏపీకి మారింది. ఓ వైపు వైసీపీ ఎంపీలు అమరావతిలో దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు టీడీపీ ఎంపీలు, టీడీపీ నాయకులు ఏపీలో హోదా కోసం ఆందోళనలు చేయనున్నారు. ఇంకోవైపు, కాంగ్రెస్, జనసేన, లెఫ్ట్ పార్టీలు హోదా కోసం సాగనున్నాయి.
టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేనలు వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు హోదా కోసం ఏకతాటి పైకి వచ్చే అవకాశాలు లేవంటున్నారు. నిన్నటి వరకు ఢిల్లీలో టీడీపీ వర్సెస్ వైసీపీగా కనిపించింది. ఇప్పుడు సీన్ మారింది. టీడీపీ ఇప్పుడు గ్రామగ్రామాన హోదా కోసం ఉద్యమించనుంది.

పవన్, జగన్ కార్నర్, బీజేపీ టార్గెట్
వచ్చే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని టార్గెట్ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్, జగన్‌లను కార్నర్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్న చందంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం జేఏసీ ఏర్పాటు చేయనున్నారు.

కేంద్రం తీరుపై గ్రామాల్లో వీడియోలు
ఢిల్లీలో వైసీపీ ఎంపీల దీక్ష ముగిసే వరకు నియోజకవర్గాల్లో రిలే దీక్షలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. హోదా ఉద్యమాన్ని విస్తృతం చేయనుంది. పార్టీ, అఖిల సంఘాలతో కలిసి ఉద్యమించనుంది. ఈ నెలాఖరు వరకు ఉద్యమ ప్రణాళిక సిద్ధం చేస్తారు. 30న చంద్రబాబు తిరుపతిలో బహిరంగ సభలో పాల్గొంటారు. జేఏసీ కమిటీ రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. సంఘాలతో చర్చిస్తున్నారు. గ్రామస్థాయిలో జేఏసీ ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం తీరుపై గ్రామాల్లో వీడియోలు ప్రదర్శించనున్నారు.

వ్యూహకమిటీ నిర్ణయాలు
సోమవారం టీడీపీ వ్యూహ కమిటీ భేటీ జరిగింది. చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు అవసరమైన కార్యాచరణను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని, యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 11న జ్యోతీరావు ఫూలే, 14న అంబేడ్కర్ జయంతి వేడుకలు, 20న దళిత తేజం కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధికార పార్టీ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. వివిధ సంఘాలతో జిల్లాల వారీగా అఖిలపక్ష సమావేశాలు, నియోజకవర్గాల వారీగా సైకిల్ యాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఎంపీల బస్సుయాత్ర
రెండు మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు బస్సు యాత్ర చేపడతారని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. అవినీతి, హత్యా రాజకీయాలకు పాల్పడినవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రంతో కొందరు కుమ్మక్కై టీడీపీపై కుట్ర చేస్తున్నారని, నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాలన్నారు. మరో వైపు వైసీపీ రైల్ రోకో నిర్వహించనుంది.
-
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!











Click it and Unblock the Notifications