కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ ప్రజలకు ఒక ముఖ్యమైన సూచన
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే అధికారులు కొన్ని ప్రధాన నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. గతంలో ఉన్నవాటిని పొడిగించారు. ఈ రైళ్లు ఏయే తేదీల్లో, ఎక్కడి నుంచి ఎక్కడకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.
07446 కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వరకు
సెప్టెంబర్ 1న అందుబాటులో ఉంటుంది.
రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్‌లో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

07258 సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ వరకు
సెప్టెంబర్ 1న అందుబాటులో ఉంటుంది. ఈ
శుక్రవారం రాత్రి 9.00 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 8.00 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.
07259 కాకినాడ టౌన్ నుంచి వికారాబాద్ వరకు
సెప్టెంబర్ 2న అందుబాటులో ఉంటుంది.
శనివారం రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్‌లో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 9.30 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
07453 నరసాపూర్ నుంచి వికారాబాద్ వరకు
సెప్టెంబర్ 3న అందుబాటులో ఉంటుంది.
ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 6.30 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
07454 వికారాబాద్ నుంచి నరసాపూర్ వరకు
సెప్టెంబర్ 4న అందుబాటులో ఉంటుంది.
సోమవారం సాయంత్రం 5.15 గంటలకు వికారాబాద్‌లో బయల్దేరి తర్వాతరోజు తెల్లవారుజామున 5.10 గంటలకు నరసాపూర్ చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications