ధర్మవరం, తిరుపతి, హైదరాబాద్, మదనపల్లి వారికి ముఖ్య గమనిక
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే అధికారులు కొన్ని ప్రధాన నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. గతంలో ఉన్నవాటిని పొడిగించారు. ఏయే తేదీల్లో, ఎక్కడి నుంచి ఎక్కడకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.
07609 పూర్ణ నుంచి తిరుపతికి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఉదయం 10.25 గంటలకు పూర్ణలో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 10.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. సెప్టెంబరు 4వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు పొడిగించారు.07610 తిరుపతి నుంచి పూర్ణకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 3.10 గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు పూర్ణకు చేరుకుంటుంది. సెప్టెంబరు 5వ తేదీ నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు పొడిగించారు.

07605 తిరుపతి నుంచి అకోలాకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు అకోలా చేరుకుంటుంది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 9 వరకు పొడిగించారు.07606 అకోలా నుంచి తిరుపతికి ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. 8.10 గంటలకు అకోలాలో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 6.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 1 వరకు పొడిగించారు.తిరుపతి, పాకాల, పీలేరు, మదనపల్లి, కదిరి, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, బస్మత్, హింగోలి దక్కన్, వాషిమ్, అకోలా స్టేషన్లలో ఆగుతుంది.












Click it and Unblock the Notifications