గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ప్రజలకు ముఖ్య గమనిక
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో భద్రతాపరమైన పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈనెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గుంటూరు-విశాఖపట్నం (సింహాద్రి ఎక్స్ ప్రెస్ 17239), రాజమండ్రి-విశాఖపట్నం (07466) మెమూ, విశాఖ-రాజమండ్రి (07467) మెమూ రైళ్లను రద్దు చేశారు. అలాగే ఈనెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విశాఖపట్నం-గుంటూరు (17240) సింహాద్రి ఎక్స్ ప్రెస్ ను రద్దు చేశారు.
దీపావళి పండగ సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ (06073) ప్రత్యేక రైలు ఈనెల 13, 20, 27 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చెన్నైలో బయలుదేరి 11.15 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అలాగే ఈనెల 14, 21, 28 తేదీల్లో రాత్రి 9.00 గంటలకు భువనేశ్వర్ లో బయలుదేరి తర్వాతరోజు తెల్లవారుజామున 3.45 గంటలకు దువ్వాడ చేరుకొని అక్కడి నుంచి 3.50 గంటలకు బయలుదేరి వెళుతుంది.

సూరత్-బ్రహ్మపుర (09069) ప్రత్యేక రైలు ఈనెల 8, 15, 22, 29, డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో మధ్యాహ్నం 2.20 గంటలకు సూరత్ లో బయలుదేరి తర్వాతరోజు రాత్రి 8.10 గంటలకు దువ్వాడ, 8.58 గంటలకు పెందుర్తి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బ్రహ్మపుర-సూరత్ (09070) ప్రత్యేక రైలు ఈనెల 10, 17, 24, డిసెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో తెల్లవారుజామున ఉదయం 3.30 గంటలకు బ్రహ్మపురలో బయలుదేరి ఉదయం 7.10 గంటలకు పెందుర్తికి, 8.20 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications