విజయవాడ, తిరుపతి, కాకినాడ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ముఖ్య సూచన
ఏడాది పొడవునా దూర ప్రాంత రైళ్లకు డిమాండ్ ఉంటుంది. అందులో రిజర్వేషన్ దొరకాలంటే కనీసం మూడునెలల ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి. ఆ సమయానికి బయలుదేరతామో? లేదో? చెప్పలేము. ఇప్పుడేమో భారతీయ రైల్వే రిజర్వేషన్ చేయించుకునే సమయాన్ని రెండు నెలలకు కుదించింది. దీంతో రిజర్వేషన్ల కోసం తన్నుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్థం కాక భారతీయ రైల్వే ప్రయాణికులు జుట్టు పీక్కుంటున్నారు. తాజాగా ఇది అయ్యప్ప స్వాముల సీజన్ కావడంతో వారంతా శబరిమలైకి వెళ్లేందుకు రోజువారీగా తిరిగే రైళ్లు సరిపోవు. ఇవి చాలా తక్కువగా ఉంటాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
కాకినాడ నుంచి కొల్లం వరకు
ఈ నెల 11, 18, 25 తేదీల్లో కాకినాడ- కొల్లం (07173) ప్రత్యేక రైలు కాకినాడ పోర్టులో రాత్రి 11.50కి బయలుదేరి రెండోరోజు ఉదయం 5.30 గంటలకు కొల్లం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కొల్లం-కాకినాడ (07174) ప్రత్యేక రైలు 13, 20, 27 తేదీల్లో కొల్లంలో ఉదయం 8.40 గంటలకు బయలుదేరి రెండోరోజు సాయంత్రం 4.00 గంటలకు కాకినాడ పోర్టుకు చేరుకుంటుంది. ఈ రైలుకు కొట్టాయం, ఎర్నాకుళం, త్రిసూర్, ఈరోడ్, సేలం, జోలార్ పేట్, కాట్పాడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ టౌన్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యాన్ని కల్పించారు.

ప్రత్యేక రైళ్లపై తీవ్ర విమర్శలు
అయితే ప్రత్యేక రైళ్లపై ప్రయాణికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఛార్జీలు అధికంగా వసూలు చేయడంతోపాటు ప్రతిరోజు నడిచే రైళ్లకు క్రాసింగ్ ఇచ్చేందుకు గంటల తరబడి స్టేషన్లలో నిలిపివేస్తున్నారని, దీనివల్ల అనుకున్న సమయానికన్నా చాలా చాలా ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించారు. సరైన సమయానికే వీటిని నడుపుతున్నామని చెబుతున్నారుకానీ వాస్తవంలో చాలా ఆలస్యమవుతున్నాయి. ఐదు గంటల జర్నీకే ఎనిమిది గంటల జర్నీ చేయాల్సి వస్తోందంటూ దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లల్లో ఎన్ని గంటలు అదనంగా జర్నీ చేయాలో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా ఛార్జీలు ఎక్కువగా తీసుకుంటూ ఆలస్యంగా తీసుకువెళుతున్న రైళ్ల సమయపాలనను మార్చాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications