బాబు మోసగాడు: మాదిగల తిరుబాటు సభ
ఎమ్మార్పీఎస్ పెద్దమాదిగనవుతానన్న చంద్రబాబు చరిత్రలో పెద్దమోసగాడయ్యాడని ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ నేతృత్వంలో అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో మాదిగల తిరుగుబాటు మహాసభ జరిగింది. ఈ మహాసభకు సిపిఐ నేత నారాయణతో పాటు మాజీమంత్రి శైలజానాథ్, ఎమ్మార్పీఎస్ నేతలు పాల్గొని ప్రసంగించారు.
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ.. త్యాగాలతో కూడిన ఉద్యమమని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కమ్యూనిస్టు పార్టీ అండగా నిలబడుతుందని సిపిఐ నేత నారాయణ హామీ ఇచ్చారు. మాదిగలు తిరగబడితేనే న్యాయం దక్కుతుందని నారాయణ చెప్పారు. రిజర్వేషన్ల వాటా మాదిగలకు దక్కకుండా అడ్డుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మనుగడ ఉండదని మరో నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ శైలజనాథ్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications