వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు మరో షాక్: కిరణ్‌ని కల్సిన ఎస్పీవై, గుడ్‌బై ఛాన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది! కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంటు సభ్యులు ఎస్పీవై రెడ్డి శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఆయన కొంతకాలంగా ముఖ్యమంత్రితో టచ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

సమైక్యంధ్ర కోసమంటూ ఎస్పీవై రెడ్డి కొద్ది రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అయితే, పార్టీ అధిష్టానం పైన అసంతృప్తితో ఉన్న ఎస్పీవై రెడ్డి ఇటీవల కిరణ్‌తో చర్చలు జరుపుతున్నారట. ఎస్పీవై రెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరుతారా? లేక కిరణ్ కొత్త పార్టీ కోసం నిరీక్షిస్తున్నారా? తెలియాల్సి ఉంది. అయితే, తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని ఎస్పీవై రెడ్డి ప్రకటించారు.

SPY Reddy may quit YSR Congress

జగన్ పైన గురువారం రఘురామ కృష్ణం రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఇంచార్జిగా ఉన్నారు. పార్టీ పైన ఆయన అసంతృప్తిగా ఉండటంతో బిజెపిలోకి వెళ్తారనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఆయనను గురువారం పార్టీ నుండి బహిష్కరించారు. మరోవైపు ఆయన తాను రాజీనామా చేసినట్లు తెలిపారు.

సబ్బం హరి ఫైర్

ఎస్పీవై రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని అనకాపల్లి ఎంపి సబ్బం హరి అన్నారు. జగన్ పార్టీలో ుంటే నేతలకు అవమానాలు తప్పవన్నారు. ఆ పార్టీలోని నేతలు అందరూ బయటకు రావాల్సిందేనన్నారు.

English summary
Kurnool distirct Nandyal MP and YSR Congress Party leader SPY Reddy on Friday met Chief Minister Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X