గౌతమి మృతిపై తల్లి స్పందన: వాంగ్మూలం మార్చేశారని సోదరి పావని
పిల్లలను పెద్ద చేసి చదివించుకుంటున్నామని, సమాజంలో ఆడపిల్లలను సరిగా చూడటం లేదని, అందుకే పుట్టినప్పుడే ఆడపిల్లలను చంపేసుకుంటున్నారని గౌతమి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
ఏలూరు: పిల్లలను పెద్ద చేసి చదివించుకుంటున్నామని, సమాజంలో ఆడపిల్లలను సరిగా చూడటం లేదని, అందుకే పుట్టినప్పుడే ఆడపిల్లలను చంపేసుకుంటున్నారని గౌతమి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
పాలకొల్లు మండలం దిగమర్రులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీ గౌతమి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసింది. మరోవైపు పోలీసులు ఇది హత్య కాదని, ప్రమాదమని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె తల్లి స్పందించారు.
మరో మూడు నెలల్లో తమ కుమార్తె ఉద్యోగంలో చేరి కుటుంబ భారమంతా తన భుజాల పైన వేసుకుంటుందనుకున్న తరుణంలో ఈ ఘోరం జరిగిందన్నారు. జనవరి 18న నరసాపురంలో ఓ కారు ఢీకొని గౌతమి చనిపోయింది. చెల్లి పావని తీవ్ర గాయాలతో బయటపడింది. ఇప్పుడు గౌతమీ మరణం కలకలం రేపింది.
పోలీసులపై నమ్మకం లేదు
పోలీసుల పైన తమకు నమ్మకం లేదని, తన వాంగ్మూలాన్ని మార్చేశారని శ్రీ గౌతమి సోదరి పావని ఆరోపించారు. న్యాయం జరగకుంటే పాలకొల్లు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications