ఏడాదిన్నర కేసులో కీలక మలుపు, శ్రీగౌతమిది హత్యే: నిందితులు టీడీపీ వాళ్లు, అసలేం జరిగింది?
ఏలూరు: దాదాపు ఏడాదిన్నర క్రితం సంచలనం సృష్టించిన శ్రీగౌతమి కేసులో కీలక మలుపు. శ్రీగౌతమి ప్రమాదంలో చనిపోలేదని, ఇది ప్రణాళికా ప్రకారం జరిగిన హత్య అని సీఐడీ పదిహేడు నెలల విచారణ అనంతరం తేల్చినట్లుగా తెలుస్తోంది. తన సోదరి పావనితో కలిసి వెళ్తున్న శ్రీగౌతమిని పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారని విచారణలో తేలిందని సమాచారం.
పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో బుజ్జి, మరికొందరు ఉన్నారని తెలుస్తోంది. ఈ హత్య వెనుక కొందరు నేతల హస్తం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అరెస్టు చేసిన వారిని నేడో రేపో మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశముంది. శ్రీగౌతమి ప్రమాదంలో చనిపోలేదని, హత్యేనని సోదరి పావని, తల్లి అనంతలక్ష్మి మొదటి నుంచి ఆరోపిస్తున్నారు.

హత్య హత్యేనని తేల్చారు
శ్రీగౌతమి కుటుంబ సభ్యుల ఆరోపణలకు ప్రతిపక్షాల నిలదీత, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. సోదరి పావని ధైర్యంగా పోరాటం ప్రారంభించింది. కేసును నిష్పక్షపాతంగా విచారించాలని కోరుతూ పోలీసు ఉన్నతాధికారులను సీబీసీఐడీని ఆశ్రయించింది. సీఐడీ జోక్యంతో విచారణ ప్రారంభమైంది. కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాఫ్తు చేసి హత్య అని తేల్చారు.

ఆ రోజు ఏం జరిగిందంటే?
2017 జనవరి 18వ తేదీన రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో పాలకొల్లు రూరల్ పరిధిలోని దిగమర్రు కొత్తొట పంచాయతీ పరిధిలో నరసాపురం - పాలకొల్లు మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆసుపత్రి పనిమీద పాలకొల్లు వెళ్లిన అక్కాచెల్లెళ్లు శ్రీగౌతమి, పావనిలు యాక్టివాపై నరసాపురం వస్తుండగా వెనుక నుంచి ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వారిని నరసాపురంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు.

ప్లాన్‌తో చేశారని ఆరోపణలు
అక్క శ్రీగౌతమి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పావని రెండు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చింది. పావని స్పృహలోకి వచ్చే వరకు అది ప్రమాదంగా భావించారు. ఎవరో మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి ఉంటారని అనుకున్నారు. కానీ పావని ఇది ప్లాన్‌తో చేసిన పనిగా ఆరోపించింది. తమపై బుజ్జి హత్యాప్రయత్నం చేశాడని ఆరోపించింది. తన అక్కను బుజ్జి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని, అప్పటి వరకు తన తల్లికి కూడా తెలియదని చెప్పారు. తన అక్కను రెండో పెళ్లి చేసుకొని మోసం చేశాడని చెప్పింది.

సీఐడీ దర్యాఫ్తుతో కదిలిన డొంక
ఇందుకు సంబంధించి పెళ్లి ఫోటోలను కూడా పావని విడుదల చేసినట్లుగా చెబుతున్నారు. నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత నిందితుడిని, మరికొందరిని విచారించారు. ప్రమాదంగా భావించి, విశాఖపట్నంకు చెందిన సందీప్, దుర్గాప్రసాద్‌లు యాక్సిడెంట్ చేశారని, వారిని అరెస్టు చేశారు. సందీప్ కొత్త కారు కొనుక్కొని భీమవరం వచ్చాడని, తిరిగి వెళ్లేటప్పుడు మద్యం మత్తులో శ్రీగౌతమి, పావనిల వెంటపడి ప్రమాదానికి కారణమయ్యారని తెలిపారు. ఆ తర్వాత సీఐడీ చేతికి కేసు వెళ్లింది. ఈ విచారణలో హత్యగా నిర్ధారణ అయిందని తెలుస్తోంది.

2016లో పెళ్లి
శ్రీగౌతమి, బుజ్జిలు 2016 జనవరిలో పెళ్లి చేసుకున్నాడని సోదరి పావని అప్పుడు ఆరోపించింది. అయితే, నేతలు ఈ కేసును అప్పట్లో తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు వినిపించాయి. కాగా, కేసు విచారణలో ఉందని, కొన్ని ఆధారాలతో కేసును మళ్లీ విచారిస్తున్నామని, పూర్తి వివరాలను రెండు మూడు రోజుల్లో వెల్లడిస్తామని, కేసు విచారణలో ఉన్నందున వివరాలు చెప్పలేమని పోలీసులు వెల్లడించారని తెలుస్తోంది. 2017 జనవరిలో హత్య జరిగింది. 17 నెలల తర్వాత సీఐడీ జోక్యంతో హత్యగా తేల్చారు. హత్యలో విశాఖకు చెందిన ఇద్దరు, నరసాపురానికి చెందిన ఐదుగురు ఉన్నారని గుర్తించారని తెలుస్తోంది. గౌతమి హత్య కేసులో నరసాపురం మండల ప్రజాప్రతినిధి పాత్ర ఉన్నట్లుగా నిర్ధారణకు వచ్చారని సమాచారం.

నలుగురు నిందితులు టీడీపీ వాళ్లే!
శ్రీగౌతమి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో నలుగురు టీడీపీ నేతలు వాళ్లే ఉన్నారని వార్తలు వస్తున్నాయి. హత్య కేసులో కీలక నిందితుడు సజ్జ బుజ్జికి టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రధాన నిందితుల్లో నర్సాపురం జెడ్పీటీసీ బాలం ప్రతాప్ ఉన్నారని అంటున్నారు. మరో ఇద్దరు నిందితుల్లో బాలం ఆండ్రూ, బొల్ల రాంప్రసాద్‌లు ఉన్నారు. వీరు కూడా స్థానిక టీడీపీ నాయకులు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications