తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నుల పండువలా శ్రీరామ నవమి ఉత్సవాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

తిరుపతి: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండలపంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ, ఆంజనేయ స్వామి వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య వేద పండితులు ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు.

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే వసంతోత్సవం, సహస్ర దీపలాంకర సేవ రద్దు చేసింది. ఏప్రిల్ 9న కూడా పర్వదినం సందర్భంగా ప్రత్యేక క్రతువులను నిర్వహించనున్నారు. త్రేతాయుగంలో అధర్మాన్ని అంతం చేయడానికి శ్రీ మహా విష్ణువు.. శ్రీరాముడిగా అవతరించాడని ఈ సందర్భంగా పండితులు తెలిపారు.

శ్రీరాముడి మానవ జాతికి ఒక ఆదర్శమని అన్నారు. సత్యం, నీతి, తండ్రికి ఒక మంచి కుమారుడిగా, భార్యకు ఒక మంచి భర్తగా, ప్రజలకు మంచి పాలన అందించిన ప్రభువుగా రామచంద్రుడు ప్రజలకు ఎప్పటికీ ఆదర్శప్రాయుడేనని చెప్పారు. శ్రీరామ నవి పర్వదినం సందర్భంగా హనుమంత వాహనంపై శ్రీరాముడు తిరుమాడ వీధుల్లో ఊరేగారు.

అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకున్న తర్వాత వేద పండితులు ప్రత్యేక క్రతువులు నిర్వహించనున్నారు. రాత్రి 10గంటల ప్రాంతంలో బంగారు వాకిలిలో వేదపండితులు శ్రీరాముని పారాయణం పఠించనున్నారు. శ్రీరామ నవమి ఆస్థానం కన్నుల పండువగా జరుగనుంది. ఈ కార్యక్రమాల్లో టిటిడి ఈఓ ఎంజి గోపాల్, జిఈఓ కెఎస్ శ్రీనివాస రాజు, డిప్యూటీ ఈఓ చిన్నంగారి రమణ, సూపరింటెండెంట్ ఇంజినీర్ రమేష్ రెడ్డి, పేష్కర్ ఆర్ సెల్వం, రామ్మూర్తి, ఇతరులు పాల్గొన్నారు.

రాములవారికి పాలాభిషేకం

రాములవారికి పాలాభిషేకం

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు.

ఉత్సవ మూర్తులకు హారతులు

ఉత్సవ మూర్తులకు హారతులు

శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండలపంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ, ఆంజనేయ స్వామి వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు.

స్నపన తిరుమంజనం

స్నపన తిరుమంజనం

వేద మంత్రోచ్ఛరణల మధ్య వేద పండితులు శ్రీరామ నవమి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు.

వైభవోపేతం..

వైభవోపేతం..

శ్రీరామ నవి పర్వదినం సందర్భంగా హనుమంత వాహనంపై శ్రీరాముడు తిరుమాడ వీధుల్లో ఊరేగారు.
త్రేతాయుగంలో అధర్మాన్ని అంతం చేయడానికి శ్రీ మహా విష్ణువు.. శ్రీరాముడిగా అవతరించాడని ఈ సందర్భంగా పండితులు తెలిపారు.

ముస్తాబైన ఉత్సవమూర్తులు

ముస్తాబైన ఉత్సవమూర్తులు

ఊరేగింపు అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకున్న తర్వాత వేద పండితులు ప్రత్యేక క్రతువులు నిర్వహించనున్నారు. సత్యం, నీతి, తండ్రికి ఒక మంచి కుమారుడిగా, భార్యకు ఒక మంచి భర్తగా, ప్రజలకు మంచి పాలన అందించిన ప్రభువుగా రామచంద్రుడు ప్రజలకు ఎప్పటికీ ఆదర్శప్రాయుడేనని వేద పండితులు ఈ సందర్భంగా చెప్పారు.

English summary
In view of the festival of Sri Rama Navami on April 8, the famed hill shrine of Lord Venkateswara at Tirumala, the Temple priests performed Snapana Tirumanjanam (Celestial Bath) to Processional Deities of Lord Rama, Seetha, Lakshmana, Anjaneya Swamy at Ranaganayakula Mandapam inside Sri Vari Temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X