లోకేష్‌ను అంటే ఊరుకునేది లేదు, నీ విషయం చెప్పుకో: పవన్ కళ్యాణ్‌కు శ్రీరెడ్డి దిమ్మతిరిగే షాక్
అమరావతి: ఇటీవల నిత్యం నెటిజన్ల నోళ్లలో, మీడియా నోళ్లలో నానుతున్న శ్రీరెడ్డి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పైన స్పందించారు. ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఆయన పేరు లేకుండా, ఆయన పార్టీ పేరు లేకుండా స్పందించారు.
Recommended Video

లోకేష్‌ను వదిలి మీరు ఏం చేస్తారో చెప్పుకోవాలని జనసేనానికి సూచించారు. నారా లోకేష్ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవారు ఎవరూ లేరని, కొత్త పార్టీ ఏం చేస్తుందో అది చెప్పుకోవాలని, అంతే విమర్శలు చేస్తే ఒప్పుకునేది లేదని, నా నోటికి పని చెప్పవద్దని ఆమె హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్‌కే కౌంటర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఉత్తరాంధ్ర పర్యటనలో మంత్రి నారా లోకేష్ పైన విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నారు. టీడీపీ నేతలు కూడా దానికి ఘాటుగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు శ్రీరెడ్డి వ్యాఖ్యలు పవన్‌ను ఉద్దేశించినవే. పైగా కొత్త పార్టీ అని కూడా పేర్కొన్నారు.

జగన్‌లా మీకు ఓపిక ఎక్కడ ఉంది?
'జగన్ అన్నలా ఓర్పు మీకెక్కడ ఉంది? జగన్ అన్న ఫ్యామిలీ లక్షల మందికి చేసిన సహాయాలు ఎవరూ మర్చిపోలేదు. సినిమా డైలాగు కొట్టి, వాటర్ తాగినంత ఈజీ కాదు. మీ అన్నయ్య రాజకీయాలు, మీ అన్న సినిమాల్లో ఎంతమందిని తొక్కాడో ఎవరికి తెలీదు. మా అసోసియేషన్ లో కార్డు, పీకే గారి మీద గౌరవంతో మీ అన్న నాకు ఇవ్వనివ్వట్లేదు. మీ చలవే కదా' అని మరో పోస్ట్ పెట్టారు శ్రీరెడ్డి.

చిరంజీవిని కూడా లాగిన శ్రీరెడ్డి
మరో పోస్టులో శ్రీరెడ్డి మెగాస్టార్ చిరంజీవిని కూడా టార్గెట్ చేశారు. 'మీ అన్న తిరుపతి నుంచి ఎన్నికైన తరువాత, 5 సంవత్సరాల్లో కేవలం ఒకే ఒక్కసారి తిరుపతికి వచ్చారని, వాళ్లకోసం సింగిల్ పైనా ఖర్చు పెట్టలేదని, ఎక్కడా కూడా తిరుపతి అభివృద్ధి గురించి మాట్లాడలేదని, తిరుపతి ప్రజల ఉవాచ. చంద్రబాబుగారు తిరుపతికి తీసుకొచ్చిన ప్రాజెక్టులు, చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు. పాలనపై అవగాహన లేనివారిని ఎన్నుకొని తప్పు పని చేయొద్దని మనవి' అని పేర్కొన్నారు.

బిగ్ బాస్ షోలో శ్రీరెడ్డి
కాగా, అతిత్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో శ్రీరెడ్డి కూడా ఉంటారనే ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. సదరు షోపై నటి పలు కామెంట్లు కూడా చేశారు. బిగ్ బాస్ పైన మెగా ఫ్యామిలీ ప్రభావం ఉందని పేర్కొన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications