TTD: శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం లో పాల్గొనాలంటే..ఇలా..!!
Tirumala: టీటీడీలో పని చేసే ఉద్యోగులకు పాలక మండలి శుభ వార్త చెప్పింది. తాజాగా జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పైన చర్చ చేసారు. అదే విధంగా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలపైన సమీక్షించారు. ఈ నెల 23న అలిపిరి వద్దగల సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ ధరను రూ 1000గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో టికెట్లు కేటాయిస్తారు.
పలు కీలక నిర్ణయాలు : టీటీడీ భక్తుల కోసం పలు నిర్ణయాలు తీసుకుంది. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఈ నెల 23న అలిపిరి వద్దగల సప్తగోప్రదక్షిణ మందిరంలో ప్రారంభం కానుంది. మొదట కొద్దిమందితో ప్రారంభించి ఆ తరువాత విస్తృత స్థాయిలో స్లాట్ల విధానంలో నిర్వహిస్తారు. ఇందుకోసం టికెట్ ధర రూ.1000/-గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో టికెట్లు కేటాయిస్తారు.

ప్రత్యక్షంగా, వర్చువల్‌గా పాల్గొనవచ్చు. టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ను రాష్ట్ర ప్రభుత్వ జి.ఓ.114 విధివిధానాలకు లోబడి టీటీడీలో అమలుకు నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అందించడానికి అవసరమైన పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇందుకోసం ఆ భూమిలో రూ.25.67 కోట్లతో గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి టెండరు ఖరారు చేసినట్లు వెల్లడించారు.
ఉద్యోగుల క్రమబద్దీకరణ : అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉద్యోగులకు అదనంగా కేటాయించిన 132 ఎకరాల్లో కూడా గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి రూ.15 కోట్లతో టెండర్లు పిలవడానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. ఇందుకయ్యే ఖర్చును ఉద్యోగులు భరిస్తారు. రిటైర్డ్ ఉద్యోగులు సహా అందరికీ ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలో మరిన్ని ఎకరాల వస్తాయి. తిరుపతిలో టీటీడీ ఉద్యోగులు నివసిస్తున్న రామ్‌నగర్ క్వార్టర్స్‌లో రూ.6.15 కోట్లతో అభివృద్ధి పనులు చేయడానికి టెండర్లను ఆమోదించాం.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి రెండు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి, బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించిన రెగ్యులర్ ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.6,850 బ్రహ్మోత్సవ బహుమానం అందించాలని నిర్ణయించారు.
భక్తుల సౌకర్యం కోసం : వకుళామాత ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. భక్తుల సదుపాయం కోసం తిరుపతి సమీపంలోని పుదిపట్ల జంక్షన్ నుండి వకుళమాత ఆలయం వద్ద గల జాతీయ రహదారి వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.21.10 కోట్లతో టెండరు ఆమోదించారు. ఇది పూర్తయితే తిరుపతికి పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పడుతుంది. గులకు చక్కటి ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తున్న ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలో రోగులకు మరింత సౌకర్యాలు కల్పించడానికి రూ.1.65 కోట్లతో గ్రౌండ్ ఫ్లోర్ అభివృద్ధి పనులకు టెండరు ఆమోదం తెలిపారు. స్విమ్స్ ఆసుపత్రి భవనాల ఆధునీకరణకు, పునర్నిర్మాణానికి రూ.197 కోట్లతో పరిపాలన అనుమతికి ఆమోదించారు. మూడేళ్లలో దశలవారీగా ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications