TTD: హనుమంత వాహన సేవలో శ్రీవారు, లంకాభీకరుడి అభయం
కలియుగ వైకుంఠ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం శ్రీవారు రాముని అవతారంలో హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు అభయం ఇచ్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు హనుమంత వాహనంపై వచ్చిన శ్రీవారిని చూసి పులకించిపోయారు.
భక్తి పరవశంతో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతుల తత్వవివేచన తెలిసిన మహనీయులు కాబట్టి ఈ ఇరువురిని ఒకేసారి చూసిన భక్తులకు వేదాలతత్త్వం ఒనగూరుతుందని భక్తుల నమ్మకం. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రి వాసుని మూపున వహించి భక్తులకు అభయం ఇచ్చారు.

హనుమంత వాహన సేవలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామీజీ, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామీజీ టీటీడీ ఈవో శ్యామలరావుతో పాటు టీటీడీ అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి జరిగిన గరుడ సేవలో సుమారు మూడు లక్షల 50 వేల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. గరుడసేవ వాహనాన్ని తిలకించడానికి లక్షలాది మంది తిరుమల చేరుకోవడంతో భక్తులందరికీ టీటీడీ అధికారులు అన్నప్రసాదాలు అందించారు.
శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా టీటీడీ అధికారులు చూసుకున్నారు. గరుడసేవ వాహనాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులకి తాగునీరు, పాలు, మజ్జిగ, అన్నప్రసాదాలు అందించారు. తిరుమల మాడ వీధుల పరిసర ప్రాంతాల్లోనే అన్ని గ్యాలరీ లో ఉన్న శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. వృద్ధులు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా టీటీడీ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
Hanumantha Vahanam
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) October 9, 2024
Sri Malayappa Swamy, with His captivating presence, blesses His devotees as He takes a serene procession on the beautifully adorned Hanumantha Vahanam through the four sacred mada streets on Wednesday.#TTD#TTDevasthanams#HanumanthaVahanam pic.twitter.com/r0rtWO42AA
గరుడ వాహన సేవ వీక్షించడానికి వచ్చిన భక్తులు గోవింద గోవిందా అంటూ స్వామివారిని భక్తితో దర్శించుకున్నారు. మంగళవారం తిరుమలలో 82 వేల 43 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు 30 వేల మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని ముక్కులు తీర్చుకున్నారు. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.10 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు నిండిపోయి క్యూలైన్ టీబీసీ కాటేజ్ వరకు వచ్చింది. సర్వదర్శనం టోకన్లు లేని భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 20 గంటలు పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications