వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిపై వట్టి కాదు నేనే: శ్రీధర్, నేతల నుండి ఆజాద్ ఆరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sridhar Babu on T Bill debate
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన తాను ప్రారంభించిన చర్చను మంత్రి వట్టి వసంత్ కుమార్ కొనసాగించారని మంత్రి శ్రీధర్ బాబు బుధవారం అన్నారు. ఈ రోజు వట్టి బిల్లు పైన చర్చను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై శ్రీధర్ బాబు స్పందించారు. ఇరవై రోజుల క్రితమే బిల్లు పైన చర్చ ప్రారంభం విషయంలో గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే.

తెలంగాణలో పరిస్థితిపై ఆజాద్ ఆరా

కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌తో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డిలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో పార్టీ పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స నారాయణ సమక్షంలో ఆజాద్ సెక్యూరిటీ జర్నలిస్టులను నెట్టివేసింది.

రాష్ట్రపతిని కలువనున్న టి నేతలు

ఈ నెల 16వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ ప్రాంత అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కలువనున్నారు. విభజన ముసాయిదా బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. సీమాంధ్ర నేతలు మరింత గడువు కోరే అవకాశముంది. ఈ నేపథ్యంలో గడువు పెంచవద్దని వారు రాష్ట్రపతిని కలిసి కోరే అవకాశముంది.

అలాగే సభ జరుగుతున్న తీరును కూడా ఆయనకు వారు వివరించనున్నారు. బిల్లుపై చర్చకు గడువు పెంచవద్దని రాష్ట్రపతిని కోరుతామని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. నలభై రోజుల సమయం ఇచ్చినా ఇంకా గడువు కావాలని కోరడం సరికాదన్నారు.

English summary
Minister Sridhar Babu on Wednesday said he was already started debate on Telangana Bill before Vatti Vasanth Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X