'వైఎస్‌ను తిట్టావ్ సరే: బాలకృష్ణ బంధువులకు, జయదేవ్‌కు దోచిపెట్టిన బాబు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. భూముల కేటాయింపు విషయంలో వైయస్ సర్కార్ పైన బురద జల్లిన చంద్రబాబు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
ఉత్తరాంధ్రలో ఎకరం రూ.10 కోట్ల విలువైన భూమిని రూ.50 లక్షల చొప్పున 50 ఎకరాలు కట్టబెట్టారని ఆరోపించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువులకు కోట్ల విలువైన రూ.498 ఎకరాల భూమిని తక్కువ ధరకు కేటాయించారన్నారు.
రాయలసీమలో ఎంపీ గల్లా జయదేవ్‌కు కోట్ల విలువైన భూమిని లక్షలకే కట్టబెట్టారని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నానని, తమ ఆరోపణల పైన ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ చేశారు.

లేదా దీని పైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పద్దెనిమిది నెలల పాలనలో 700 చీకటి జీవోలు జారీ చేశారని ధ్వజమెత్తారు. పారదర్శక పాలన అంటున్న చంద్రబాబు అవినీతికి గేట్లు ఎత్తేశారన్నారు.
ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములను బంధువులకు కట్టబెడుతున్నారన్నారు. వందల కోట్ల విలువైన భూములు తమ వారికి కట్టబెట్టడం ఏ సామాజిక న్యాయమని నిలదీశారు. చంద్రబాబు దోపిడీపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భయంకర అవినీతి జరుగుతోందన్నారు. అసెంబ్లీలో వీటిపై ఎండగడతామన్నారు.












Click it and Unblock the Notifications