వారి కాళ్లు పట్టుకుని జగన్‌పై కేసులు: చంద్రబాబుపై శ్రీకాంత్ రెడ్డి ధ్వజం
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తాము ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పెరగడాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహించలేపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు పార్టీ నేత వాసిరెడ్డి పద్మతో కలిసి ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
ప్రతిపక్షాలన్నీ తమకు మద్దతు తెలిపితే టిడిపికి మద్దతు తెలిపారని ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం తము కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన తర్వాతనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆయన అన్నారు. నాలుగేళ్లు బిజెపితో అంటకాగి ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

చంద్రబాబు అలా చెప్పలేదా..
హోదా వద్ద ప్యాకేజీ వద్దన్నది చందర్బాాబు కాదా అని ఆయన ప్రశ్నించారు. యువభేరీలకు విద్యార్థులను పంపవద్దని కాలేజీ యాజమాన్యాలను చంద్రబాబు ఆదేశించడం నిజం కాదా అని అడిగారు.

చంద్రబాబు అధ్యాయం ముగిసింది...
చంద్రబాబు అధ్యాయం ముగిసిందని, టిడిపి పని అయిపోయిందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలు, కుమ్మక్కులేనని ఆయన అన్నారు. చీకటి రాజకీయాల్లో చంద్రబాబు నేర్పరి అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు వాళ్ల కాళ్లు పట్టుకుని..
చిదంబరం, భరద్వాజ కాళ్లు పట్టుకని వైఎస్ జగన్‌పై చంద్రబాబు కేసులు పెట్టించారని ఆయన ఆరోపించారు. జగన్‌పై పెట్టిన దొంగ కేసులు కొట్టేస్తారేమోనని చంద్రబాబు భయపడుతున్నారని ఆయన అన్నారు.

అలా ఎందుకు చేస్తున్నారు...
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు బండారం మరోసారి బయటపడిందని వాసిరెడ్డి పద్ విమర్శించారు. అవిశ్వాసం పెడుతామని చెప్పి లోకసభ వెల్‌లోకి టిడిపి ఎంపీలు వెళ్లి ఆందోళన చేశారని ఆమె అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా టిడిపి ఎంపీలు సభను ఎందుకు అడ్డుకున్నారని ఆమె ప్రశ్నించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications