Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీశైలం డ్యామ్ భద్రతకు పెనుముప్పు.. వరదనీటితో ప్రమాదం; పాండ్యా కమిటీ నివేదికలో షాకింగ్ విషయాలు

శ్రీశైలం డ్యాం కు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రీశైలం డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవటం ఒక సమస్య అయితే, శ్రీశైలం జలాశయానికి అంచనాకు మించి వరదనీరు వస్తే కూడా ప్రమాదం పొంచి ఉందని నిపుణుల కమిటీ చెప్పటం ఇప్పుడు మరో కొత్త సమస్య . శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద నీరు మళ్ళించటానికి ప్రత్యామ్నాయం చూడాలని లేదంటే డ్యాం కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని నిపుణుల కమిటీ వెల్లడించటం ఆందోళన కలిగిస్తుంది.

శ్రీశైలం డ్యాం కు పొంచి ఉన్న ప్రమాదాలు

శ్రీశైలం డ్యాం కు పొంచి ఉన్న ప్రమాదాలు

తెలుగు రాష్ట్రాలకు బహుళ ప్రయోజనకారి అయిన శ్రీశైలం డ్యాం భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. గతంలో శ్రీశైలం జలాశయంలో నిల్వ ఉన్న నీరు, డ్యాం లో చేరిన మట్టి పూడిక ఎంతగా ఉందో తెలుసుకోవడానికి 15 రోజుల పాటు హైడ్రో గ్రాఫిక్స్ సర్వే నిర్వహించి మట్టి పూడికతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ సామర్ధ్యం బాగా తగ్గిందని పేర్కొన్నారు.

రిజర్వాయర్ యొక్క బేస్ లెవల్‌లో ఏర్పడిన మట్టి పూడిక, కోత, డ్యామ్ యొక్క భద్రతా అంశాలను అధ్యయనం చేయడానికి సర్వే నిర్వహించారు. ప్రతి సంవత్సరం డ్యామ్‌లో మట్టి పేరుకుపోవడంతో డ్యామ్ కూడా ప్రతి సంవత్సరం దాదాపు 2 టీఎంసీల నీటి నిల్వ స్థాయిని కోల్పోతోందని అంచనా వేశారు. ఇదిలా ఉంటే తాజాగా పాండ్యా కమిటీ డ్యాం భద్రత విషయంలో కీలక సూచనలు చేసింది.

శ్రీశైలం వరద విషయంలో నివేదిక ఇచ్చిన పాండ్యా కమిటీ

శ్రీశైలం వరద విషయంలో నివేదిక ఇచ్చిన పాండ్యా కమిటీ

శ్రీశైలం డ్యాం భద్రత విషయంలో 2020 ఫిబ్రవరిలో కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా చైర్మన్ గా పదిమంది నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటైంది. అంతకు ముందు కూడా శ్రీశైలం డ్యాం భద్రత కోసం అనేక కమిటీలు ఏర్పాటు అయ్యాయి. అవి ఇచ్చిన నివేదికలు బుట్ట దాఖలయ్యాయి.

ఇక 2021లో కేంద్ర జల సంఘం శ్రీశైలం వరద ప్రవాహం పై అధ్యయనం చేసి ఒక నివేదికను సమర్పించింది. గతంలో ఏర్పాటైన కమిటీల సిఫార్సులు, సీడబ్ల్యూసీ తో పాటు తమ పరిశీలనలో తేలిన అంశాలు, చర్యలపై పాండ్యా కమిటీ ఇటీవల తుది నివేదికను ఇచ్చింది. ఇక ఈ నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించింది.

వరద నీటితో డ్యాం భద్రతకు ముప్పు.. నివేదికలో పేర్కొన్న అంశాలు ఇవే

వరద నీటితో డ్యాం భద్రతకు ముప్పు.. నివేదికలో పేర్కొన్న అంశాలు ఇవే

వరద అంచనాలను బట్టి ముందుగానే డ్యాం లోని నీటిని ఖాళీ చేయాలని, అదనపు స్పిల్ వే నిర్మాణం చేపట్టాలని లేదా వరదనీటిని కుందూ లాంటి పక్క బేసిన్ కు తరలించాలని పేర్కొంది. ప్రస్తుత డ్యామ్ గరిష్ట నీటిమట్టం 892 అడుగులను మరింత పెంచాలని, శ్రీశైలం డ్యామ్ భద్రతను కాపాడటం కోసం ఈ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కమిటీ సూచించింది. స్పిల్ వే గేట్ల నుంచి నీళ్లు కిందపడి మళ్లీ ఎగిరిపడే ప్రాంతమైన ప్లంజ్ పూల్ లో భారీ గుంత ఏర్పడడం డ్యామ్ భద్రతకు ముప్పు అని కమిటీ పేర్కొంది. ప్లంజ్ పూల్ సహా డ్యాం, స్పిల్ వే కు సంబంధించిన మరమ్మతులు, పునరావాస చర్యలకు వెంటనే శ్రీకారం చుట్టాలని పాండ్య కమిటీ సూచించింది.

డ్యాం ఎత్తు పెంచటం, అదనపు స్పిల్ వే నిర్మాణం.. నీటి మళ్లింపు.. ప్రత్యామ్నాయాలు

డ్యాం ఎత్తు పెంచటం, అదనపు స్పిల్ వే నిర్మాణం.. నీటి మళ్లింపు.. ప్రత్యామ్నాయాలు

ప్రస్తుతం ఉన్న స్పిల్ వే సామర్థ్యానికి తగ్గట్టుగా లేదని పేర్కొంది. డ్యాం ఎత్తు పెంచడం పైన, కుడి ఎడమ వైపుల నుండి నీటిని మళ్లించడానికి ఏర్పాట్లు చేయడం, కొత్తగా మరో స్పిల్ వే నిర్మించడం పైన కూడా దృష్టిపెట్టాలని సూచించింది. డ్యాం ఎగువన ఐదు కిలోమీటర్ల దూరంలో అదనపు స్పిల్ వే నిర్మాణానికి అవకాశముందని పేర్కొంది. ఇక కొంత వరదను కుడి వైపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నై తాగునీటికి, ఇతర ప్రాజెక్టులకు మళ్లించవచ్చు. ఎడమవైపున కూడా ఎగువ భాగంలో నీటిని మళ్లించడానికి అవకాశం ఉందని పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+