Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోరి కొలిచేవారి కొంగుబంగారం శ్రీశైలం మల్లన్న: నయనానందకరంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు; 11న అంకురార్పణ!!

శ్రీశైలం మల్లన్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 11 నుండి 21 వరకు నిర్వహించనున్నారు.

నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య వెలసిన ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి పుణ్యక్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం క్షేత్రం ముస్తాబవుతోంది. అనునిత్యం హర హర మహాదేవ శంభో శంకర అంటూ మారుమోగే శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కోరి కొలిచేవారి కొంగు బంగారం శ్రీశైలం మల్లన్న .. శివరాత్రి బ్రహ్మోత్సవాలు

కోరి కొలిచేవారి కొంగు బంగారం శ్రీశైలం మల్లన్న .. శివరాత్రి బ్రహ్మోత్సవాలు

కొలిచే వారి కొంగుబంగారం శ్రీశైలం మల్లన్న. ఇక్ష్వాకులు, రెడ్డి రాజులు, చాణిక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు ఎంతోమంది శ్రీశైలం మల్లన్న సేవలు చేసుకున్నారంటే శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఉన్న చారిత్రక నేపథ్యం, స్వామి గొప్పతనం తెలుసుకోవచ్చు. అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది, దశ భాస్కర క్షేత్రాలలో ఆరవది అయిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది అయిన శ్రీశైలం నాటి నుంచి నేటి వరకు భక్త జన సందోహంతో, భగవన్నామస్మరణతో మారుమోగుతోంది. అటువంటి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఈనెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు.

11వ తేదీన శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

11వ తేదీన శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ


ఈనెల 11వ తేదీన సాయంత్రం మల్లికార్జున స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 21వ తేదీ వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు, వివిధ వాహన సేవలతో శ్రీశైలం పుణ్యక్షేత్రం నయనానందకరంగా భక్తులకు కనువిందు చేయనుంది. భక్తవ శంకరుడు , భోళా శంకరుడు అయిన ఆ మల్లికార్జున స్వామి భక్తులకు వివిధ రూపాలలో దర్శనం ఇవ్వనున్నారు. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు వివరాలను చూస్తే 11వ తేదీన సాయంత్రం అంకురార్పణ తరువాత 12వ తేదీన స్వామివారికి భృంగి వాహన సేవను నిర్వహించనున్నారు. 13వ తేదీన హంస వాహన సేవ జరగనుంది. అదే రోజు విజయవాడ దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.

బ్రహ్మోత్సవాలలో స్వామి ప్రత్యేక పూజలు.. వాహనసేవలు ఇలా

బ్రహ్మోత్సవాలలో స్వామి ప్రత్యేక పూజలు.. వాహనసేవలు ఇలా


14వ తేదీన మయూర వాహన సేవ నిర్వహించనున్నారు. 14వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. 15వ తేదీన రావణ వాహన సేవను నిర్వహిస్తారు. ఆరోజు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఇక 16వ తేదీన పుష్ప పల్లకి సేవ, 17వ తేదీన గజవాహన సేవ నిర్వహిస్తారు. 18 వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం ప్రభోత్సవం నిర్వహిస్తారు. ఆరోజు రాత్రి 7 గంటలకు నంది వాహన సేవ, రాత్రి 10 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, ఆపై పాగాలంకరణ చెయ్యనున్నారు.

21వ తేదీన స్వామి ఏకాంతసేవతో బ్రహ్మోత్సవాలు సమాప్తం

21వ తేదీన స్వామి ఏకాంతసేవతో బ్రహ్మోత్సవాలు సమాప్తం

అర్థరాత్రి 12 గంటలకు స్వామివారికి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. 19వ తేదీన సాయంత్రం రథోత్సవాన్ని, ఆపై తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. 20వ తేదీన పూర్ణాహుతి కార్యక్రమాన్ని, రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక బ్రహ్మోత్సవాలలో చివరి రోజు అయిన 21వ తేదీన స్వామివారికి అశ్వవాహన సేవను, రాత్రి 8 గంటలకు పుష్పోత్సవాన్ని, ఆపై శయనోత్సవాన్ని, ఏకాంత సేవను నిర్వహించి మల్లన్న బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+