వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ హమీతోనే శిల్పా సోదరులు వైసీపీలోకి, చక్రపాణిపై బుడ్డా షాకింగ్ కామెంట్స్

రెండు ఎమ్మెల్యే, ఓ ఎంపి స్థానాన్ని ఇస్తామని వైసీపీ ఇచ్చిన హమీ మేరకే శిల్పా సోదరులు టిడిపిని వీడి వైసీపీలో చేరారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: రెండు ఎమ్మెల్యే, ఓ ఎంపి స్థానాన్ని ఇస్తామని వైసీపీ ఇచ్చిన హమీ మేరకే శిల్పా సోదరులు టిడిపిని వీడి వైసీపీలో చేరారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు.

నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికను పరిస్థితిని పురస్కరించుకొని వైసీపీ, టిడిపిలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అయితే ఈ స్థానంలో విజయం సాధించేందుకు రెండు పార్టీలు వ్యూహ రచనలో మునిగిఉన్నాయి.

రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు నంద్యాలలోనే మకాం వేసి గెలుపు కోసం ప్లాన్ చేస్తున్నారు. మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డిలు టిడిపిని వీడారు.

శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీ అభ్యర్థిగా నంద్యాల స్థానంలో బరిలో నిలిచారు. అయితే శ్రీశైలం అసెంబ్లీ టిక్కెట్టు విషయంలో అధిష్టానం నుండి స్పష్టత రాలేదనే కారణంగా శిల్పా చక్రపాణిరెడ్డి కూడ టిడిపిని వీడారు.

ఆ ఒప్పందం మేరకే వైసీపీలో

ఆ ఒప్పందం మేరకే వైసీపీలో

కర్నూల్ జిల్లాలోని రెండు అసెంబ్లీ, ఓ పార్లమెంట్‌స్థానం ఇస్తామని వైసీపీ హమీ ఇచ్చినందున శిల్పా సోదరులు టిడిపిని వీడారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. జగన్‌ది రాక్షస మనస్థత్వమైతే, శిల్పా సోదరులది పైశాచిక మనస్తతత్వమన్నారు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి.

Recommended Video

Nandyal By-Poll : A Big War Between Akhila Priya And Silpa Mohan Reddy
మహనంది ఎంపిపి పదవికి రూ.12 లక్షలు తీసుకొన్నారు

మహనంది ఎంపిపి పదవికి రూ.12 లక్షలు తీసుకొన్నారు

కర్నూల్ జిల్లా మహనంది ఎంపిపి పదవికి రూ. 12 లక్షలు తీసుకొని అనంతరం రూ. 13 లక్షలను బాండ్లు రాయించుకొన్న నీచ సంస్కృతి శిల్పా చక్రపాణిరెడ్డికి ఉందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు బోళా శంకరుడు అని ఆయన చెప్పారు.

ఎమ్మెల్యేలు, పార్టీ నేతల కృషితో ఎమ్మెల్సీగా

ఎమ్మెల్యేలు, పార్టీ నేతల కృషితో ఎమ్మెల్సీగా

వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలు, టిడిపి ఎమ్మెల్యేలు, నేతల కృషితోనే శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించారని బుడ్డా రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. చంద్రబాబునాయుడు వల్లే రెండు దఫాలు చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీగా, ఓ దఫా టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారని ఆయన చెప్పారు.

శిల్పా సోదరులు పదవులు లేకుంటే బతకలేరు

శిల్పా సోదరులు పదవులు లేకుంటే బతకలేరు

శిల్పా సోదరులు పదవి, అధికారం లేకపోతే బతకలేరని బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం నుండి టిడిపి టిక్కెట్టును శిల్పా చక్రపాణిరెడ్డి కోరడం సహేతుకమేనా అని ఆయన ప్రశ్నించారు. సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీచేయడమే తప్పన్నారాయన.

English summary
Srishailam Mla Budda Rajasekhar reddy made allegations on Silpa brothers.2 Assembly, 1 parliament seats assured from Ysrcp to Silpa brothers said Budda Rajashekar reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X