ఒకేసారి తిరుమలలో, కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు, అక్కడ వైఎస్ జగన్, ఇక్కడ పెద్దిరెడ్డి !

తిరుపతి/తిరుమల/కాణిపాకం: ఉమ్మడి చిత్తూరు జిల్లా భక్తులతో కిటకిటలాడుతున్నది. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలైనాయి, ఇక చిత్తూరు సమీపంలోని కాణిపాకంలో శ్రీవరసిద్ది వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు అధికారులు సర్వం సిద్దం చేశారు. కాణిపాకం వరసిద్ది వినాయకుడిని భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వినాయక చవితి సందర్బంగా ప్రతి సంవత్సరం కాణిపాకంలోని శ్రీవరసిద్ది వినాయకస్వామికి ప్రత్యక పూజలు నిర్వహిస్తారు. కాణిపాకంలో ఎంతో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కాణిపాకంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల సందర్బంగా వేకువ జామున 4 గంటల నుంచి భక్తకు స్వామి వారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పించారు.

Srivari Brahmotsavam in Tirumala and Sri Vinayakaswamy Brahmotsavam in Kanipakam are happening simultaneously

వినాయక చవితి సందర్బంగా కాణిపాకంలోని శ్రీ వినాయకస్వామి ఆలయాన్ని, ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణి. ఆలయం పరిసర ప్రాంతాలను రంగురంగుల పుష్పాలతో సర్వంగా సుందరంగా అలంకరించారు. కాణిపాకంలో శ్రీవినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Srivari Brahmotsavam in Tirumala and Sri Vinayakaswamy Brahmotsavam in Kanipakam are happening simultaneously

వినాయక చవితి సందర్బంగా భక్తులతో కాణిపాకం కిటకిటలాడుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుమల తరువాత శ్రీకాళహస్తి, కాణిపాకం పుణ్యక్షేత్రాలు ఎంతో ప్రసిద్ది చెందిన పురాతణమైన ఆలయాలు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయకుడిని దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు. కర్ణాటకు చెందిన వేలాది మంది భక్తులు ప్రతిరోజు కాణిపాకంకు వెళ్లి వస్తుంటారు.

ఇక ప్రపంచ ప్రసిద్ది చెందిన తిరుమలలో కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తరువాత కాణిపాకంకు వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కాణిపాకంలో శ్రీవినాకయ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్బంగా చిత్తూరు జిల్లా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.

Srivari Brahmotsavam in Tirumala and Sri Vinayakaswamy Brahmotsavam in Kanipakam are happening simultaneously

కాణిపాకంలో శ్రీ వరసిద్ది వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్బంగా తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తితో పాటు మదనపల్లె, నెల్లూరు. వేలూరు. చెన్నై, బెంగళూరు తదిరత ప్రాంతాల నుంచి కాణిపాకం వెళ్లడానికి ప్రత్యేక ఆర్ టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. ఇక కార్లు, ప్రైవేటు వాహనాల్లో వచ్చే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది.

Srivari Brahmotsavam in Tirumala and Sri Vinayakaswamy Brahmotsavam in Kanipakam are happening simultaneously

కాణిపాకంలో భక్తల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రతిరోజు నిర్వహించే ఉచిత అన్నదాన కార్యక్రమానికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని కాణిపాకం ఆలయం చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయం ఈవో వెంకటేశ్ తెలిపారు. తిరుమల బ్రహ్మోల్సవాల సందర్బంగా శ్రీవెంకటేశ్వరస్వామికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు. కాణిపాకంలో శ్రీవరసిద్ది శ్రీ వినాయకస్వామికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+