TTD: తిరుమలలో వైభవంగా శ్రీవారి చక్రస్నానం, నేటితో పూర్తి

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. శనివారం రాత్రి ద్వజారోహణ కార్యక్రమంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీవారి ఆలయం సమీపంలోని పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. పుష్కరిణిలో శ్రీవారి ఆలయం అర్చకులు ఈ కృతువును పూర్తి చేశారు.

పుష్కరిణిలో జరిగిన శ్రీవారి చక్రస్నానం తిలకించడానికి భక్తులు పుష్కరణి చూట్టూ బారులు తీరారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నానం పూర్తి చేశారు. అనంతరం పుష్కరిణిలోకి వెళ్ళిన శ్రీవారి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీవారి చక్రస్నానం పూర్తి అయిన తర్వాత అదే పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేస్తే మనం చేసిన పాపాలు తొలగిపోతాయని శ్రీవారి భక్తుల నమ్మకం.

Srivari Chakrasananam was performed magnificently by the priests at Pushkarani in Tirumala

ఈ సందర్భంగా పుష్కరిణిలోకి భక్తులు ఒకేసారి ప్రవేశించకుండా టీటీడీ అధికారులు, సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గత ఎనిమిది రోజులుగా మలయప్ప స్వామికి వివిద వాహన సేవలు నిర్వహించారు. వివిధ అవతారాల్లో శ్రీవారు భక్తులకు అభయం ఇచ్చి ఆశీర్వదించారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుని వివిద వాహన సేవల్లో పాల్గొన్నారు.

తిరుమలలో గరుడ సేవ రోజు మాత్రమే సుమారు 3.50 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరైన భక్తులకు టీటీడీ అధికారులు, సిబ్బంది ప్రతినిత్యం పాలు, మజ్జిగ, తాగునీరు, అన్నప్రసాదాలు అందించారు. విజయదశమి రోజు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ద్వజారోహణతో పూర్తి కానున్నాయి. తిరుమలలో బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Srivari Chakrasananam was performed magnificently by the priests at Pushkarani in Tirumala

శుక్రవారం తిరుమలలో 71,443 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26,948 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శుక్రవారం శ్రీవారికి రూ 2,52 కోట్లు హుండీ ద్వారా ఆధాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు వైకుంఠం కాంప్లెక్స్ లోని 12 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 10 గంటల నుండి 12 గంటలు సమయం పడుతుంది. శనివారం విజయదశమి పండగ రావటం, మరుసటి రోజు ఆదివారం కావడంతో తిరుమల చేరుకుంటున్న భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+