రూ. 460 కోట్లతో భక్తుల కోసం భారీ టౌన్ షిప్- నాలుగు బ్లాకుల్లో: అన్నీ అక్కడే

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 84,014 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 35,131 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.69 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 నుంచి 22 గంటల సమయం పట్టింది.

శ్రీవారి వైభవాన్ని దేశం నలువైపులా వ్యాప్తి చేయడానికి టీటీడీ పలు నిర్ణయాలను తీసుకుంది. వీటి గురించి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. టీటీడీ స్థానిక, అనుబంధ ఆలయాలలో మార్చి నెల లోపు భక్తులకు రెండు పూటలా అన్నప్రసాదాలు అందించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే టీటీడీలోని 56 ఆలయాలలో ప్రస్తుతం 17,000 మందికి దాతల సహకారంతో అన్నప్రసాదాల వితరణ జరుగుతోంది.

Srivari Temple development in Amaravati with Rs 92 Cr Project to Add Kalyana Mandapam and Rajagopuram

భక్తుల నుండి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా రూ.25.60 కోట్లతో తిరుమలలో ఏటీజీహెచ్ నుండి అక్టోపస్ బిల్డింగ్ వరకు ఔటర్ రింగ్ రోడ్డులో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తోంది టీటీడీ. ఒంటిమిట్ట మాస్టర్ ప్లాన్ లో భాగంగా రూ.37 కోట్లతో 100 గదుల నిర్మాణం, రూ.16.5 కోట్లతో 108 అడుగుల జాంబవంతుని విగ్రహం నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇతర ఆలయాల అభివృద్ధికి టీటీడీ ఇతోధికంగా ఆర్థిక సహాయం అందిస్తోంది.

రాజధాని అమరావతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఆలయం ఇది. రూ.92 కోట్లతో రెండో ఆలయ ప్రాకారం, కల్యాణోత్సవ మండపం, రాజగోపురం తదితర అభివృద్ధి పనులు రెండేళ్ల కాలంలో పూర్తి చేయనుంది టీటీడీ. ఇక్కడ రెండు పూటలా అన్నప్రసాద వితరణ చేయడానికి చర్యలు తీసుకుంటోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం పీఏసీ 5 అందుబాటులోకి వచ్చింది. దీన్ని మరింత విస్తరించడానికి టీటీడీ ప్రణాళికలు వేస్తోంది.

మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అలిపిరి సమీపంలో భక్తుల వసతి, అనుబంధ సదుపాయాల కోసం రూ.460 కోట్లతో నాలుగు బ్లాకులుగా టీటీడీ టౌన్ షిప్ నిర్మించనుంది. తిరుమల కొండలలో అటవీ విస్తీర్ణం పెంచడానికి, జీవ వైవిధ్య పునరుద్ధరణ, హరిత అభివృద్ధికి గాను 10 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికకు చర్యలు తీసుకుంటోంది. తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ సహకారంతో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, వారు ఎక్కువ సేపు క్యూలైన్లలో వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం, భద్రత కల్పిస్తున్నాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+