రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏడవటంకాదు, రాజీనామా చెయ్: చిరంజీవి తీవ్ర వ్యాఖ్య, ఎన్టీఆర్ విగ్రహం పెట్టి: రఘువీరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజమండ్రిలో జరిగిన గోదావరి పుష్కరాల ప్రమాద ఘటన పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మంగళవారం నాడు మండిపడ్డారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కన్నీరు కార్చడం కాదని, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు చిరంజీవి, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు కన్నీరు కార్చడం కాదని, బాధ్యత వహించి రాజీనామా చేయాలని చిరంజీవి అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు.

రాజమండ్రిలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. ఇది ప్రభుత్వం వైఫల్యం, చేతకానితనమన్నారు. ఆరు నెలలుగా మన మహా పుష్కరాలు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ఇప్పుడేం చేశారని నిలదీశారు. పుష్కరాలకు గర్వపడాలని చెప్పారని గుర్తు చేశారు.

మహా కుంభమేళాలా దీనిని నిర్వహిస్తామని చెప్పారని, కానీ తీవ్ర విషాదం చోటు చేసుకుందన్నారు. మహా కుంభమేలాలోను ఇలాంటి సంఘటన జరగలేదన్నారు. చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చిరంజీవి హితవు పలికారు.

వైయస్ సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా పుష్కరాల సమయంలో ఒకరిద్దరు చనిపోతే నానాయాగీ చేసిన చంద్రబాబు ఇప్పుడేం మాట్లాడతారని చిరు ప్రశ్నించారు. నాడు వైయస్ రాజీనామా చేయాలని చంద్రబాబు పట్టుబట్టారని, ఇప్పుడు ఆయన చేయాలన్నారు.

Stampede at Godavari Pushkaralu in AP: Chiranjeevi demands for Chandrababu resignation

మీడియా పైన ఆగ్రహం

కొంతమంది మీడియా వ్యక్తులు చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్నారని చిరంజీవి ధ్వజమెత్తారు. ఇలాంటి ఘోరాలు కూడా వారికి పట్టవా అని ధ్వజమెత్తారు. ఈ మధ్యాహ్నం మూడు గంటలకు రఘువీరా, తాను ఇతర కాంగ్రెస్ నేతలు రాజమండ్రి వెళ్తున్నట్లుచెప్పారు. మృతుల కుటుంబాలను పరిశీలిస్తామని చెప్పారు.

రాజీనామా చేయకున్నా క్షమాపణ చెప్పాలి: రఘువీరా

చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా ఎలాగూ చేయరని, కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు.
గోదావరి తీరాన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారని, ఇది అపచారమని రఘువీరా రెడ్డి అన్ారు. ఎన్టీఆర్‌ను చంపిన పాపాన్ని కడిగేసుకోవడానికి ఆయన విగ్రహాన్ని చంద్రబాబు ఏర్పాటు చేశారని, దీనికోసం ఏకంగా 27 మందిని బలిచ్చారని ధ్వజమెత్తారు.

సోనియా, రాహుల్, గవర్నర్ నరసింహన్ దిగ్భ్రాంతి

రాజమండ్రి ఘటన పైన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ప్రధాని మోడీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, వైపీసీ చీఫ్ జగన్, తెలంగాణ సీఎం కెసిఆర్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజమండ్రి పుష్కర ప్రమాదంలో 27 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

English summary
Stampede at Godavari Pushkaralu in AP: Chiranjeevi demands for Chandrababu resignation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X