రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'జియోగ్రాఫిక్ ఛానల్‌కు చెప్పింది నిజమే కానీ, బోయపాటికి సంబంధంలేదు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ ప్రమాదం పైన ఏపీ ప్రభుత్వం ఆదివారం వివరణ ఇచ్చింది. 144 ఏళ్లకు వచ్చే మహా పుష్కరాల నేపథ్యంలో గోదావరి పుష్కరాలను వీడియోగ్రాప్ చేయాలని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్‌ను అడిగామని చెప్పారు.

అయితే, ఇందులో ఎలాంటి వ్యక్తిగత ప్రచారం లేదని వివరణ ఇచ్చింది. ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ వివరణ ఇచ్చారు.

మహా పుష్కరాలను వీడియో తీసి.. గోదావరి పుష్కర గొప్పతనాన్ని, శ్రేష్టతను ప్రపంచానికి తెలియజేయాలని కోరామని చెప్పారు. ఇది వ్యక్తిగత ప్రయోజనం లేదా ప్రచారం కోసం ఏమాత్రం కాదని చెప్పారు.

Stampede at Godavari Pushkaralu: Chandrababu was not focus

అంతేకాదు, జియోగ్రాఫిక్ ఛానల్ షూటింగ్ వల్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుణ్య స్నానం, పూజ ఆలస్యమైందనే ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. దీనిని వివాదాస్పదం చేయడం బాధాకరణని చెప్పారు.

అలాగే, బాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను ఈ డాక్యుమెంటరీ తీస్తున్నారనే వాదనలను కూడా కొట్టి పారేశారు. దీంతో అతనికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. రాజమండ్రి విషాధ ఘటన పైన సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారన్నారు. చంద్రబాబు పుష్కరాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

కాగా, గత శనివారం రాత్రి చంద్రబాబు ప్రతి ఘాట్‌కు వెళ్లి పరిశీలించారని చెప్పారు. అతను తన అతిథి గృహానికి ఉదయం 5.30 గంటలకు వచ్చారన్నారు. మళ్లీ ఉదయం 10.30 గంటలకు తిరిగి సమీక్షిస్తున్నారన్నారు. అది చంద్రబాబు కమిట్మెంట్ అన్నారు.

English summary
The state government said on Sunday that it had asked the National Geographic Channel to videograph the Godavari Maha Pushkaralu as it occurs once in 144 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X