వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం, 23న అవార్డు తీసుకోనున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అరుదైన గౌరవం లభించింది. సీఎన్‌బీసీ టీవీ18 అందించే ఇండియా బిజినెస్‌ లీడర్‌ అవార్డుల్లో భాగంగా ఏపీకి ప్రతిష్టాత్మక స్టేట్‌ ఆఫ్‌ ద ఇయర్ పురస్కారం లభించింది.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అరుదైన గౌరవం లభించింది. సీఎన్‌బీసీ టీవీ18 అందించే ఇండియా బిజినెస్‌ లీడర్‌ అవార్డుల్లో భాగంగా ఏపీకి ప్రతిష్టాత్మక స్టేట్‌ ఆఫ్‌ ద ఇయర్ పురస్కారం లభించింది.

బ్యాంకింగ్‌, పారిశ్రామిక రంగాల జాతీయస్థాయి ప్రముఖుల జ్యూరీ ఈ అవార్డుకు ఏపీని ఎంపిక చేసింది. జ్యూరీలో హెచ్‌డీఎఫ్‌సీ సీఎండీ ఆదిత్య పురి, ఎస్‌బీఐ సీఎండీ అరుంధతి భట్టాచార్య, కేకేఆర్‌ సంస్థ సీఈవో సంజయ్ నాయర్‌, కార్పొరేట్‌ న్యాయవాది సైరిల్‌ ష్రోఫ్‌, ఇ అండ్‌ వై సంస్థ ఛైర్మన్‌ రాజీవ్‌ మెమనీ ఉన్నారు.

<strong>ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు: తిరగబడ్డ జగన్ వ్యూహం, మళ్లీ భూమా షాక్!</strong>ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు: తిరగబడ్డ జగన్ వ్యూహం, మళ్లీ భూమా షాక్!

మార్చి 23వ తేదీన పురస్కారం ప్రదానం చేయనున్నారు. పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందింది.

State of the Year award for Andhra Pradesh government

కాగా, అవార్డు రావడం పట్ల ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు.అభివృద్ది, టెక్నాలజీ వినియోగం, సమర్థ నాయకత్వం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేసినట్లు భావిస్తున్నట్లు చెప్పారు.

గతేడాది ఆంధ్రప్రదేశ్‌ 10.99 శాతం వృద్దిరేటు సాధించిందని, ఈ అర్థ సంవత్సరంలో 12.44 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. ఈ ఏడాది వృద్ధిరేటు 12-13 శాతం మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తూ, పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతికతను అందిపుచ్చుకుని పౌరసరఫరాల శాఖలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చినట్లు వివరించారు.

English summary
State of the Year award for Andhra Pradesh government. AP CM Chandrababu Naidu will reciev this award on 23rd of March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X