పొరపాటని సోనియాకు తెల్సింది, టి రాదు: రాయపాటి

కచ్చితంగా రాష్ట్ర విభజన ఆగుతుందన్నారు. సమైక్య రాష్ట్రంలోనే 2014 ఎన్నికలు జరుగుతాయని, విభజన ఆఘిపోతే కాంగ్రెసు మళ్లీ గెలుపొందడం ఖాయమన్నారు. తెలంగాణ నేతలు పరిధి దాటి మాట్లాడుతున్నారని, దీనివల్ల వారి ఆశలు నెరవేరవన్నారు. బిల్లుపై సమగ్రంగా చర్చించి సభ్యులంతా మాట్లాడి బిల్లును వ్యతిరేకించి పంపాలన్నారు. తాము పార్లమెంటులో దానిని అడ్డుకొని విజయం సాధించేలా ప్రయత్నిస్తామన్నారు.
ముఖ్యమంత్రి కోరితే బిల్లుపై చర్చకు సమయం పొడిగిస్తారన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాను శ్రీవారిని ప్రార్థించానని చెప్పారు. ముఖ్యమంత్రి కొత్త పార్టీపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని అభిప్రాయపడ్డారు. తనకు టిడిపి నుండి ఆహ్వానం రాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగానే పోటీ చేస్తానన్నారు.
22న చలో హైదరాబాద్
ఈ నెల 22వ తేదీన చలో హైదరాబాద్, అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తామని ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు చెప్పారు. ఇంటికి ఒకరు చొప్పున రావాలన్నారు. పథకం ప్రకారమే విభజనవాదులు సీమాంధ్ర ప్రజలను కించపర్చేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు బిల్లును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కాగా, చలో హైదరాబాదు, అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం మూర్కత్వమని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications