తప్పిన పెను ప్రమాదం: నడిరోడ్డుపై కూలిన బండరాయి (ఫోటోలు)
తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. చిన్నపాటి వర్షానికే కొండ చరియలు విరిగి ఘాట్ రోడ్డులో పడుతున్నాయి. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ఫెన్షింగ్ ఏర్పాటు చేయాలని యాత్రికులు కోరుతున్నారు.
తాజాగా తిరుమలలో కురిసిన వర్షానికి రెండో ఘాట్ రోడ్డులోని 10వ కిలోమీటర్ వద్ద గురువారం పెద్ద బండరాయి కూలింది. ఈ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నడిరోడ్డుపై కూలిన బండరాయి వల్ల పెద్ద సంఖ్యలో వాహనాలు నిలచిపోయాయి.
క్రేన్ సాయంతో బండరాయి తొలగించేందుకు యత్నించినా అతి సాధ్యం కాలేదు. దీంతో వాహనాలు వెళ్లేందుకు వీలుగా రాయిని కొంత వరకు పక్కకు తీశారు. ఆ తర్వాత దేవస్ధాన సిబ్బంది చేత రాయిని పగులకొట్టి తొలగిస్తామని ఇంజనీర్లు తెలిపారు.
గతంలోనే ఐఐటీ నిపుణులు నరసింహారావు ఘాట్ రోడ్డులో పర్యటించి కూలే బండరాళ్లను తొలగించాలని, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. అయినప్పటికీ ఇంజనీర్లు చర్యలు తీసుకోలేదు. దీంతో బండరాళ్లను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు.

తప్పిన పెను ప్రమాదం: నడిరోడ్డుపై కూలిన బండరాయి
తిరుమలలో కురిసిన వర్షానికి రెండో ఘాట్ రోడ్డులో గురువారం పెద్ద బండరాయి కూలింది. ఈ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

తప్పిన పెను ప్రమాదం: నడిరోడ్డుపై కూలిన బండరాయి
నడిరోడ్డుపై కూలిన బండరాయి వల్ల పెద్ద సంఖ్యలో వాహనాలు నిలచిపోయాయి. క్రేన్ సాయంతో బండరాయి తొలగించేందుకు యత్నించినా అతి సాధ్యం కాలేదు.

తప్పిన పెను ప్రమాదం: నడిరోడ్డుపై కూలిన బండరాయి
దీంతో వాహనాలు వెళ్లేందుకు వీలుగా రాయిని కొంత వరకు పక్కకు తీశారు. ఆ తర్వాత దేవస్ధాన సిబ్బంది చేత రాయిని పగులకొట్టి తొలగిస్తామని ఇంజనీర్లు తెలిపారు.

తప్పిన పెను ప్రమాదం: నడిరోడ్డుపై కూలిన బండరాయి
గతంలోనే ఐఐటీ నిపుణులు నరసింహారావు ఘాట్ రోడ్డులో పర్యటించి కూలే బండరాళ్లను తొలగించాలని, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు.

తప్పిన పెను ప్రమాదం: నడిరోడ్డుపై కూలిన బండరాయి
అయినప్పటికీ ఇంజనీర్లు చర్యలు తీసుకోలేదు. దీంతో బండరాళ్లను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు గురువారం భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది.

తప్పిన పెను ప్రమాదం: నడిరోడ్డుపై కూలిన బండరాయి
సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 41,152 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 15 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న సర్వదర్శనం భక్తులకు 8 గంటలు, కాలిబాట భక్తులకు 6 గంటల సమయం తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం లభిస్తోంది.
-
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
అలిపిరితో పాటు తిరుమలలో -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications